బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆహ్వానం..

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:36 PM

బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆహ్వానం..

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 177 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌, డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ హిందీ పోస్టులు ఉన్నాయి. 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేయాలి. హిందీ సబ్జెక్టుగా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే సెప్టెంబర్‌ 15నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది . అక్టోబర్ 10 వరకు చివరి తేది .పూర్తి వివరాల కొరకు https://www.nabard.org/ ని చూడవచ్చును.









Untitled Document
Advertisements