భారత్ మార్కెట్లోకి గూగుల్ ఫిట్ బిట్ కొత్త స్మార్ట్ వాచీలు.. ధర?

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 01:43 PM

భారత్ మార్కెట్లోకి గూగుల్ ఫిట్ బిట్ కొత్త స్మార్ట్ వాచీలు.. ధర?

ఫ్యాషన్ ప్రియుల కూసం మార్కెట్లోకి రోజుకో కొత్త రకం ఉత్పత్తులు వస్తూనే ఉంటాయి. ఫ్యాషన్ తో పాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే ఉత్పత్తులకు కొదవలేకుండా పోతున్న రోజులివి.. అయితే తాజాగా గూగుల్ కు చెందిన ఫిట్ బిట్ న్యూ వెర్షన్ స్మార్ట్ వాచీలు.. ఫిట్ బిట్ వెర్సా 4, ఫిట్ బిట్ సెన్స్ 2, ఇన్ స్పైర్ 3 ఇప్పుడు మన భారత్ లోనూ కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ తో భాగస్వామ్యం కలిగిన రిటైల్ స్టోర్లలో ఇవి లభిస్తాయి. వీటిల్లో హార్ట్ రేట్ ను మానిటర్ చేసే సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ చెప్పే సెన్సార్ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఫిట్ బిట్ ఇన్ స్పైర్ 3 తక్కువ ధరతో ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న సాధనం. దీని ధర రూ.8,999. మిగిలిన రెండు మోడళ్లు.. ఫిట్ బిట్ సెన్స్ 2 రూ.20,499, వెర్సా 4 ధర రూ.24,999గా ఉంది. వీటిని ఆన్ లైన్ లో అమెజాన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు వస్తుంది.
ఇన్ స్పైర్ 3 అన్నది ఫిట్ నెస్ బ్యాండ్ వంటిది. ఫిట్ నెస్ కోరుకునే వారికి ఇది అనుకూలం. నిద్ర తీరు, ఒత్తిడి స్థాయులను ట్రాక్ చేస్తుంది. సెన్స్ 2 లోనూ ఇన్ స్పైర్ 3 ఫీచర్లు అన్నీ ఉన్నాయి. అలాగే, 40 ఎక్సర్ సైజ్ మోడ్స్, జీపీఎస్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్కిన్ టెంపరేచర్ ఎంత ఉందో చెప్పే సెన్సార్లు ఉన్నాయి. వెర్సా 4లో అదనంగా ఈసీజీ ట్రాకింగ్ కూడా ఉంటుంది. వెర్సా 4, సెన్స్ 2 రెండూ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఫిట్ బిట్ ను గూగుల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements