కోటి రూపాయలు విలువ చేసే ఎర్ర చందనం పట్టివేత

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 12:40 PM

కోటి రూపాయలు విలువ చేసే ఎర్ర చందనం పట్టివేత

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడినట్లు కనిపిస్తోంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వై రిశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు తాలూకా పోలీసులు శనివారం నాడు 122 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వీటి విలువ సుమారు 1.22 కోట్లు ఉంటుందని తెలిపారు. చిత్తూరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఇంటెన్సివ్ వెహికల్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారని తెలిపారు. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఒక లారీ, రెండు కార్లు, ఒక మోటార్ బైక్‌ను ట్రాప్ చేసి 122 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడు రాష్ట్రానికి తరలించి భారీ ఆదాయాన్ని పొందేవారు.





Untitled Document
Advertisements