నకిలీ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేస్తున్న భూములు..

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 02:47 PM

నకిలీ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేస్తున్న భూములు..

భూముల విలువ పెరిగినకొద్దీ క్రమంలోనే భూమి పత్రాలు లేని భూములను కూడా నకిలీ రిజిస్ట్రేషన్లతో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వారు మాత్రం వాటిని తీసుకున్న చాలా రోజుల స్పందిస్తున్నారు. ఆపై, మాకు సంబంధం లేదంటూ విక్రయదారులు చేతులు దులుపుకుంటున్నారు. కాగా చిత్తూరు పట్టణం కట్టమంచికి చెందిన బాధితుడు దినేష్‌ కుమార్‌ అతని భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగి కబ్జాకు గురయ్యిందని ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు.
సదరు అక్రమ రిజిస్ట్రేషన్‌ పై చిత్తూర్‌ జిల్లా ఎస్‌.పి. రిశాంత్‌ రెడ్డి సూచనల మేరకు చిత్తూర్‌ డి. ఎస్‌.పి. సుధాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూర్‌ ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ నరసింహరాజు సిఆర్‌ నెంబర్‌ 377/2022 ఎస్‌ఇ 420, 464, 465, 467, 468, 471 120-బి చిత్తూరు వన్‌టౌన్‌ పరిధిలో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు లో వెలుగులోకి వచ్చిన సమాచారం ఏమనగా, 1981వ సంవత్సరంలో కట్టమంచి రెవిన్యూ రికార్డుల ప్రకారం 459/1, 461/1 లో ఉన్న 05 ఎకరాలా 02 సెంట్ల భూమిని మీనాక్షి, పద్మావతమ్మ పెరి అన్నన్‌ , కష్ణమూర్తి అనేవారు తమ తండ్రిగారైన లేట్‌ ఆర్‌. వేంకటాచలపతి పేరుపై డాక్యుమెంట్‌ నెంబర్‌ 2252, 2254, 2255 ల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసి ఉన్నారు. అయితే భూమి యొక్క అడంగల్‌ మీనాక్షమ్మ అనే పేరుపై ఉంది. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని భూమి యజమానిని మోసం చేయాలనే ఉద్దేశ్యంతో కరుణాకర్‌ రెడ్డి, డి. యమున, చిత్తూర్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పనిచేయు సురేంద్ర, జయచంద్ర, అశోక్‌ కుమార్‌ తదితరులు భూమికి సంబంధించిన డాకుమెంట్స్‌ లో మీనాక్షమ్మ యొక్క భర్తగా దొరస్వామి రెడ్డి, వారి సంతానముగా కరుణాకర్‌ రెడ్డి, యమునా గా ఫేక్‌ డాకుమెంట్స్‌ లను తయారు చేసి భాగ పరిష్కారం కింద 459/1 లో ఉండే 02 ఎకరాలు మరియు 70 సెంట్ల భూమిని మూడు నెలల క్రితం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు.
ముద్దాయిలు ఏడుగురు రెవిన్యూ, రిజిస్టేషన్‌ శాఖల్లో పని చేసే సిబ్బందికి భారీ మొత్తంలో డబ్బులిచ్చి చిత్తూరు నగరంలోని మిట్టూరులో కోటి రూపాయల విలువ చేసే డాక్టర్‌ అతాఫ్‌హుసేన్‌ భూమి, కట్టమంచిలో పది కోట్ల విలువ చేసే 5.5ఎకరాల భూమి, కొంగారెడ్డిపల్లిలో ఐటిఐ వద్ద విశాలక్షమ్మకు చెందిన 52 సెంట్ల భూమి, దుర్గానగర్‌ కాలనీలో ఏపి వెల్‌ఫేర్‌ అసోషియేషన్‌ భూమి, మంగసముద్రంలో ప్రభుత్వ భూమి 70 సెంట్లు, మదనపల్లికి చెందిన మషూర్‌ ఆలిఖాన్‌ చెందిన కోటి రూపాయులు విలువ చేసే భూమి, కట్టమంచి, కొంగారెడ్డిపల్లిలో రూ. 12 కోట్లు విలువ చేసే భూములకు ఫేక్‌ డాక్యూమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏడుగురు ముద్దాయిలు రాజశేఖర్‌రెడ్డి, యమన, జయచంద్రారెడ్డి, సురేంద్రబాబు, శేఖర్‌, అశోక్‌కుమార్‌లపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు రూ. 50 కోట్ల విలవైన భూములు, స్థలములకు నకిలి డాక్యుమెంట్లను సష్టించి నట్లు గుర్తించారు.





Untitled Document
Advertisements