క్రిస్పీ అండ్ చీజీ రైస్ పాపర్స్

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 04:11 PM

క్రిస్పీ అండ్ చీజీ రైస్ పాపర్స్

క్రిస్పి క్రిస్పిగా కొద్దిగా సాఫ్ట్ టచ్ తో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే చీజీ రైస్ పాపర్స్ పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్.. మరీ ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చుసేద్దామా..
కావాల్సిన పదార్ధాలు : బియ్యం - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు - 1, పుదీనా ఆకులు - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి), కొత్తిమీర ఆకులు - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి), కారం పొడి - 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్ (సన్నగా తరిగినవి),నిమ్మరసం - 1/2 టి స్పూన్ * మిరియాల పొడి - 1/2 టి స్పూన్* నూనె - 1 టేబుల్ స్పూన్ * బ్రెడ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు * చీజ్ ముక్కలు - 2, ఉప్పు - రుచికి సరిపడా, మైదా - 3 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ - 4-5 టేబుల్ స్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా
తయారి విధానం : ముందుగా అన్నం, ఉడికించిన బంగాళదుంపలను ఒక గిన్నెలో వేసి చేతితో బాగా మగ్గించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి, నిమ్మరసం, మిరియాల పొడి, బ్రెడ్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత చీజ్‌ను 4 పొడవాటి ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత మెత్తగా పిసికిన పిండిలోంచి బంతిని తీసి అరచేతిలో వేసి చదును చేసి, మధ్యలో పన్నీర్ ముక్కను వేసి మూతపెట్టాలి. మొత్తం పిండిని ఇలాగే చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి, వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. పాన్ లో నూనె వేడెక్కాక, ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్‌ను మైదా నీళ్లలో వేసి, బ్రెడ్‌క్రంబ్స్‌లో ఒకసారి వేయించి, నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. కుడుములు అన్నీ ఇలాగే వేయించుకుంటే చీజ్ రైస్ పాపర్స్ రెడీ.





Untitled Document
Advertisements