నారింజ తొక్కతో మెరిసే మేని ఛాయ మీసొంతం !

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 05:29 PM

నారింజ తొక్కతో మెరిసే మేని ఛాయ మీసొంతం !

అందంగా కనిపించేందుకు ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. చర్మం తెల్లబడటం కొరకు ఖరీదైన క్రీమ్స్ మరియు లోషన్స్ కొరకు చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే చాలా మంది తమకు అందుబాటులో ఉండే వాటితోనే సహజ సిద్ధంగా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఫేస్ క్రీమ్ లను వాడటం వల్ల ముఖ చర్మం అందంగా మారటం సంగతి అటుంచి చర్మం దెబ్బతింటుంది. సహజసిద్ధంగా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకునే చిట్కాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
*ఆరెంజ్ తొక్క : ఆరెంజ్ తొక్క , పెరుగు ఫేస్ ప్యాక్ ను ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అరేంజ్ తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడి చేసి గాలిపోకుండా ఉండే డబ్బాలో నిల్వ చేయాలి. ఒక స్పూన్ ఆరేంజ్ తొక్కల పొడిలో పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖం మీద ఉన్న మచ్చలను మరియు గుర్తులను తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖం అందంగా తెల్లగా మెరిసిపోతుంది.
*కలబంద, పాలమీగడ : కలబంద తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్‌ను సపరేట్ చేయాలి. పాలు కాచిన తర్వాత పైన పేరుకునే పాల మీగడ ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పాల మీగడ, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచుకుని అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
*ఓట్ మీల్, పెరుగు , టమోటో : ఒక గిన్నెలో ఒక స్పూన్ ఓట్ మీల్,పెరుగు, టమోటో రసం తీసుకోని బాగా కలపాలి. అలా కలపగా తయారైన పేస్ట్ ను ముఖం,మెడకు బాగా పట్టించి 20 నిముషాల తర్వాత నీటి తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే సహజంగా చర్మం అందంగా మారుతుంది. ఓట్ మీల్ సహజంగా చర్మం ఎక్స్ ఫ్లోటింగ్ లో సహాయపడుతుంది. చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది.
*టమోటా, శనగపిండి : రెండు స్పూన్స్ శనగపిండిలో నాలుగు స్పూన్స్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిముషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇది చర్మం తెల్లపడటానికి బాగా సహాయపడుతుంది. చర్మంపై ఉండే నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
*నిమ్మకాయ, తేనే : నిమ్మకాయ, తేనే వంటగదిలో అందుబాటులో ఉంటాయి. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే తీసుకోని బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు తర్వాత గోరు వెచ్చని నీటితోముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది.





Untitled Document
Advertisements