చింతకాయల విజయ్ కేసుపై స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 03:33 PM

చింతకాయల విజయ్ కేసుపై స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున

చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు బీభత్సం సృష్టించారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలు అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎల్లో మీడియా చేసేది జర్నలిజమేనా అంటూ మండిపడ్డారు. తప్పు చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సీఐడీ పోలీసులు వెళితే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఒక స్త్రీపై అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తిని ఈ మీడియా ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని, ఐటీడీపీలో అతడి పోస్టులు హీనంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేశ్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. చింతకాయల విజయ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.

Untitled Document
Advertisements