అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్ల తో 43 ఇంచుల స్మార్ట్ టీవీ..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 04:12 PM

అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్ల తో 43 ఇంచుల స్మార్ట్ టీవీ..

భారతదేశంలో జనానికి వినోదం అందించేంది ఎక్కువగా టీవీనే. పెరుగుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అయితే చాల మంది టీవీలకు సెల్ ఫోన్ లకు అంకితమవుతున్నారు. కాగా ప్రస్తుతం అన్ని డివైజ్‌లు స్మార్ట్‌గా మారుతున్నాయి. టెక్నాలజీ ద్వారా డివైజ్‌లకు మరిన్ని ఫీచర్లను యాడ్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌ వాచ్‌లు, టీవీలు వంటివి మార్కెట్‌లోకి వచ్చాయి. చాలా కంపెనీలు ఆండ్రాయిడ్‌ టీవీలను లాంచ్‌ చేస్తున్నాయి. కాగా మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ టీవీ వచ్చేసింది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే స్మార్ట్ టీవీ లభిస్తోంది. 43 అంగుళాల స్మార్ట్ టీవీని అందుబాటు ధరలోనే కొనుగోలు చేయొచ్చు. ఆఫర్ వివరాలు ఏంటివో తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌ఫినిక్స్ కొత్త స్మార్ట్ టీవీల సేల్ ప్రారంభం అయ్యింది. ఈ టీవీ రేటు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 43 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు రూ. 13,999గా ఉంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
అయితే ఇన్‌ఫినిక్స్ 43 అంగుళాల స్మార్ట్ టీవీ వై1ను సేల్‌లో భాగంగా రూ. 12,599కే కొనుగోలు చేయొచ్చు. సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ బెనిఫిట్ లభిస్తుంది. వీటిపై రూ.1400 తగ్గింపు అందుబాటులో ఉంది. సాధారణంగా ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 24,999గా ఉంది. అలాగే ఇన్‌ఫినిక్స్ మరో టీవీని కూడా అందుబాటులో ఉంచింది. ఈ టీవీ 32 అంగుళాలు ఉంటుంది. ఇది కూడా స్మార్ట్ టీవీనే. ఈ టీవీని కేవలం రూ.8,999కు కొనొచ్చు. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 16,999గా ఉంది. అయితే ఈ టీవీపై ఆఫర్ ఉంది.
ఇన్‌ఫినిక్స్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకుంటే కేవలం రూ. 8,099కే కొనుగోలు చేయొచ్చు. సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డుల ద్వారా కొంటే రూ. 900 వరకు తగ్గింపు వస్తుంది. అందువల్ల 32 అంగుళాల టీవీ లేదంటే 43 అంగుళాల టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీవీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
కాని ఈ టీవీలపై ఈఎంఐ ఆఫర్లను గమనిస్తే.. నెలవారీ ఈఎంఐ రూ. 1257 నుంచి ప్రారంభం అవుతోంది. 43 అంగుళాల స్మార్ట్ టీవీకి ఇది వర్తిస్తుంది. 12 నెలల ఈఎంఐ ఎంచుకుంటే ప్రతి నెలా ఈ మొత్తం చెల్లించాలి. ఎస్‌బీఐ కార్డుకు ఇది వర్తిస్తుంది. అదే ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అయితే నెలకు రూ. 486 నుంచి కూడా చెల్లించొచ్చు. అయితే ఇక్కడ ఈఎంఐ టెన్యూర్ 36 నెలలుగా ఉంటుంది. అదే 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 679 కట్టాలి. క్రెడిట్ కార్డు లేకుంటే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ సదుపాయం కూడా పొందొచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ట్ టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, హెచ్ఎల్‌జీ సపోర్ట్ వంటి ఫీచర్లు సహా ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ చూడొచ్చు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పని చేస్తుంది. సౌండ్ ఔట్‌పుట్ 20 వాట్. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్‌గా ఉంది.





Untitled Document
Advertisements