తెలంగాణలో భారీగా కొలువుల జాతర.. టీఎస్పీఎస్సీ పోస్టుల రాత పరీక్ష తేదీ ప్రకటించిన ప్రభుత్వం..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 11:02 AM

తెలంగాణలో భారీగా కొలువుల జాతర.. టీఎస్పీఎస్సీ పోస్టుల రాత పరీక్ష తేదీ ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఉండటంతో అర్హులైన వారు ఉద్యోగాన్ని సంపాదించేందుకు పుస్తకాలతో కుస్తి పడుతున్నారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను మానేసి పరీక్ష కోసం సంసిద్ధమవుతున్నారు. అయితే చాలా మందిలో ఎలాంటి సిలబస్‌ ఉంటుంది.. పరీక్ష ఎలా ఉంటుంది.. ఎన్ని మార్కులు ఉంటాయనేదానిపై అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన పూర్తి వివరానలు వెల్లడించింది. పరీక్ష విధానం, మార్కులు, సిలబర్‌ తదితర అంశాలను వెల్లడించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు ప్రభుత్వం తేదీ ప్రకటించింది.
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 61 వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందగా.. టీఎస్పీఎస్సీ నుంచి వాటికి సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన నిర్వాహకులు దీనికి సంబంధించి ఫైనల్ కీ అండ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెండు లేదా మూడు రోజుల్లో పీఈటీకి సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసి.. డిసెంబర్ రెండో వారం నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16న జరగ్గా.. దీనికి సంబంధిచి ఫైనల్ కీ విడుదల చేశారు. దీనిపై హారిజెంటల్ రిజర్వేషన్ గురించి కోర్డు కేసు ఉండగా.. ఈ ఫలితాలు ఆగిపోయాయి. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ నుంచి వెల్లడైన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1,06,263 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీని ఖరారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్ నోటీస్ ద్వారా టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
కాగా డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2) పోస్టులు మొత్తం 53 పోస్టులు. దీనిలో ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02 కేటాయించారు. జూలై 01, 2022 అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ కు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. అయితే ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు.
మరియు ఈ 53 పోస్టులను మల్టీ జోనల్ విధానంలో భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1లో 28, మల్టీ జోన్ 2లో 25 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 450 మార్కులు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ అండ్ మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించారు. ఈ పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది.





Untitled Document
Advertisements