వరుస ఘటనలతో సరికొత్త సర్క్యులర్ అమలులోకి.. ఎయిర్ ఇండియా

     Written by : smtv Desk | Wed, Jan 11, 2023, 01:06 PM

వరుస ఘటనలతో సరికొత్త సర్క్యులర్ అమలులోకి.. ఎయిర్ ఇండియా

గడిచిన కొన్నిరోజుల్లో ఎయిర్ ఇండియాలో చోటు చేసుకున్న రెండు దురదృష్టకర సంఘటనలతో మేనేజ్ మెంట్ లో చురుకుదనం వచ్చింది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునారావృతం కాకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దురుసు ప్రవర్తనతో కూడిన ప్రయాణికుల గురించి వెంటనే సమాచారం అందించాలంటూ క్యాబిన్ క్రూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రయాణికుడు, ప్రయాణికులతో తోటి ప్రయాణికులకు రిస్క్ ఉంటుందని భావిస్తే వారి ప్రయాణానికి నిరాకరించాలని డ్యూటీ మేనేజర్, స్టేషన్ మేనేజర్ కు సూచించింది.
ప్రయాణికుల మధ్య దురుసు ఘటన ఏదైనా చోటు చేసుకుంటే, తర్వాత వారు రాజీ పడినా కానీ, సంబంధిత ఘటనపై విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూడడం తెలిసిందే. వీటి తర్వాత ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలపాలైంది. వీటిపై తాము వెంటనే స్పందించి ఉండాల్సిందని టాటా గ్రూపు చైర్ పర్సన్ చంద్రశేఖరన్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. మరీ వీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఏ మేరకు కలసి వస్తాయో.





Untitled Document
Advertisements