షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు?

     Written by : smtv Desk | Thu, Jan 12, 2023, 04:37 PM

షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు?

సాధారణంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్లిన సమయంలో అక్కడ ఎవరినైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చీ.. లేదా కౌగిలించుకుని పలకరిస్తాము. అలాగే ఏదైనా విష్ చేసే సమయంలో కూడా షేక్ హ్యాండ్ ఇస్తాము.. అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్ళిరోజు శుభాకాంక్షలు, లేదా ఆల్ ధి బెస్ట్ చేప్పడానికి ఇలా కొన్ని సందర్భాలలో షేక్ హ్యాండ్ ఇస్తాము.. అయితే అసల షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు.. దాని వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం చాల మందికి వస్తుంది.. అసలు షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు అనేది తెలుసుకుందాం..
ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు కరచాలనం చేసుకోవడం చూస్తుంటాం. దీనినే షేక్ హ్యాండ్ అంటారు. షేక్ హ్యాండ్ దగ్గరితనానికి మంచి గుర్తు. అవతలి వ్యక్తి మనతో నీవు నాకు బాగా కావలసినవాడివి. నీతో స్నేహం చేయడం నాకిష్టం అని చెప్పే భావం. షేక్ హ్యాండ్ లో ఇమిడి వుంది. అంతేకాదు, నీ కష్టసుఖాలో నేను తోడుగా వుంటాను. నీ విజయానికి నా అభినందనలు. అనే సందేశం కూడా వుంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక కళ.





Untitled Document
Advertisements