వరి సాగులో నీటి వినియోగం అధికం.. కారణమేంటి?

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 03:26 PM

వరి సాగులో నీటి వినియోగం అధికం.. కారణమేంటి?

ఈ ప్రపంచంలో ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి.. వాటిలో అన్ని ఒకేలా అసలు ఉండవు ఒక్కో మొక్కలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దాని ఎత్తు, పరిమాణము, ఆకుల నిర్మాణం.. ఇలా అనేకం. కానీ ఎందుకు అలా ఉంటాయి అన్నీ ఒకేలా ఎందుకు ఉండవు అని అందరూ అనుకుంటారు.. అయితే దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఒకే జాతికి చెందిన మొక్కల్లో కూడా అనేక తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు వరి, జొన్న, రాగి మొదలైనవి గడ్డి జాతికి చెందినవి. అయితే, వరిని మినహాయించి మిగిలిన వాటిని అతి తక్కువ నీటితోనే పండించవచ్చు. వరికి మాత్రం నీరు ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది. కొర్రలు అదే రకం వరైనా మాత్రం తక్కువ నీటితోనే పండించవచ్చు. ఇందుకు కారణమేమంటే కాలక్రమంలో వరి మొక్క వాతావరణం పరిస్థితులకు తగిన విధంగా అధిక నీటిని వాడటానికి అలవాటు పడింది. అందువలనే వివిధ మొక్కలు భిన్నభిన్న వ్యత్యాసాలు కలిగి ఉండటానికి ప్రధాన కారణం జన్యుపరిభాషలో అడాప్టేషన్ మాత్రమే. ప్రజ్ఞానం జన్యు ఆధారిత పరిజ్ఞానం, మొక్కల క్రియాత్మక ధర్మాలు ఈ మూడు మొక్కల తీరుతెన్నులను నిర్దేశిస్తాయి.





Untitled Document
Advertisements