తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఓలా

     Written by : smtv Desk | Fri, Jan 13, 2023, 03:32 PM

తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు  ఉద్వాసన పలికిన ఓలా

గత కొద్దిరోజులుగా కంపెనీల ఆర్థిక భారం తగ్గించుకోవడం కొరకు పలు దిగ్గజ కంపెనీలు తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాయి. తాజాగా అదే విధంగా క్యాబ్ ఆపరేటింగ్ కంపెనీ ఓలా కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గత ఏడాది ఓలా 1,100 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఓలా ఎలక్ట్రిక్, ఓలా క్యాబ్స్, ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు.
తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో టెక్నాలజీ, ప్రాడక్ట్ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ తొలగింపులు అని ఓలా తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు కాంపెన్సేషన్ ప్యాకేజీలను అమలు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఇంజినీరింగ్, డిజైన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయని తెలిపింది. సీనియర్ ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది.





Untitled Document
Advertisements