అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న కృతిశెట్టి తాజా చిత్రం 'కస్టడీ' పోస్టర్

     Written by : smtv Desk | Wed, Jan 18, 2023, 12:32 PM

అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న  కృతిశెట్టి తాజా చిత్రం 'కస్టడీ'  పోస్టర్

యువ హీరో నాగచైతన్య ఉప్పెన ఫెమ్ కృతి శెట్టి జంటగా ఇప్పటికే బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా వీరికి ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేకపోయింది. మరో సారి నాగచైతన్య - కృతి శెట్టి జంటగా 'కస్టడీ' సినిమా రూపొందుతోంది. టైటిల్ పోస్టర్ నుంచి ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు డైరెక్షన్ భాద్యతలు చేపట్టారు.. తెలుగు .. తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని మే 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కృతి శెట్టి పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె 'రేవతి' పాత్రను పోషించిందనే విషయాన్ని రివీల్ చేశారు. రేవతి ఆందోళన .. ఆవేదనకి లోనైనట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఏమై ఉంటుందనే ఒక ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు.
ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. 'బంగార్రాజు' తరువాత చైతూ - కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అందువలన అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమా హిట్ చైతూకి చాలా అవసరం. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న కృతికి మరింత అవసరమనే చెప్పాలి. మరీ ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాలి అంటే సినిమా థియేటర్ లలోకి వచ్చే వరకు ఆగాల్సిందే.





Untitled Document
Advertisements