చిరు కౌంటర్ మాములుగా లేదుగా .. వాల్తేరు వీరయ్య

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 01:50 PM

చిరు  కౌంటర్ మాములుగా లేదుగా .. వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలోను అభిమానులు వున్నారు. దేశ విదేశాలలోనూ అభిమానులను సంపాదించుకున్న చిరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఆయనకున్న మంచి లక్షణం. ఈ లక్షణంతోనే అంచలంచెలుగా ఎదుగుతూ మెగా స్టార్ గా మారదు. విలన్ గా , సహాయ సతుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోగా మారిన ఆయన ప్రయాణం చాల గొప్పది. అంచలంచలుగా ఎదుగుతూ ఏళ్ళు గడిచినా ఇంకా ఇండస్ట్రీని ఎలేస్తున్న నటుడు చిరు. తాజాగా ‘రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి..’ అన్న డైలాగ్ కు తగ్గట్లే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కలెక్షన్లతో దూసుకుపోతోంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఓవర్సీస్ లో 2.2 మిలియన్ డాలర్లకు పైనే సాధించింది.
అయితే సినిమా రిలీజైన తర్వాత కొన్ని వెబ్ సైట్స్ 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. దీనిపై హర్ట్ అయిన చిరంజీవి.. దాదాపు 10 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఓవర్సీస్ ఫ్యాన్స్ తో మాట్లాడిన మెగాస్టార్.. 2.25 రేటింగ్స్ కి కొత్త అర్థం చెప్పారు.
‘‘వాల్తేరు వీరయ్య సినిమాకి కొన్ని వెబ్ సైట్లు 2.25 రేటింగ్స్ ఇచ్చాయి. 2.25 అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు.. ఇప్పుడు అర్థమైంది. 2.25 అంటే 2.25 మిలియన్ డాలర్లని ఇప్పుడు తెలిసింది. ఈ మూవీ ఓవర్సీస్ లో 2.25 మిలియన్ డాలర్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది’’ అని చెప్పుకొచ్చారు.

తక్కువ రేటింగ్ ఇచ్చిన వారికి చిరు కౌంటర్ మామూలుగా లేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వాల్తేర్ వీరయ్యకు వచ్చిన కలెక్షన్లతోనే జవాబు చెప్పారని అంటున్నారు.





Untitled Document
Advertisements