విజయం కోసం సినిమా పరిశ్రమ ఎంతో క్రూరంగా వ్యవహరిస్తుంది.. కంగనా

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 02:58 PM

విజయం కోసం సినిమా పరిశ్రమ ఎంతో క్రూరంగా వ్యవహరిస్తుంది.. కంగనా

కంగనా రనౌత్ వివాదాస్పద వాఖ్యలు చేస్తూ తరుచుగా వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి. నటిగా తనకి ఎంతటి పేరుందో వివాదాల్లో చిక్కుకోవడంలోను ఈ అమ్మడికి అంతే ఫెమ్ ఉంది. కొంతకాలం క్రితం వివాదాస్పద ట్వీట్లతో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై గతంలో ట్విట్టర్ వేటు వేసింది. అయితే, ప్రస్తుతం కంగనా రనౌత్ తిరిగి ట్విట్టర్ లోకి అడుగు పెట్టేసింది. కొన్ని కారణాల వలన గతంలో ఆమె ఖాతా తొలగించగా.. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత అలాంటి ఖాతాలను పునరుద్ధరించడంతో కంగన ఖాతా కూడా తెరుచుకుంది. చిత్ర పరిశ్రమ ధోరణిని ఆమె తన తాజా ట్వీట్ల ద్వారా తప్పు బట్టారు. ఇక్కడ ఒక సినిమా ఎంత విజయం సాధించిందన్నది అది వసూలు చేసుకునే కలెక్షన్ల ఆధారంగా చూస్తారని వాపోయింది. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో బుధవారం బాక్సాఫీసు జర్నీ మొదలు పెట్టగా.. సరిగ్గా ఇదే సమయంలో కంగన ట్వీట్ చేయడం గమనార్హం.

ప్రాజెక్ట్ విజయం కోసం సినిమా పరిశ్రమ ఎంతో క్రూరంగా వ్యవహరిస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. సినిమా అన్నది భారీ లాభాలు పొందేందుకు తీసేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘ప్రాథమికంగా కళ అనేది ఆలయాల్లో భాసిల్లుతుంది. సాహిత్యం, థియేటర్, చివరిగా సినిమాల్లోకి చేరుతుంది. ఇదొక పరిశ్రమ. కానీ బిలియన్, ట్రిలియన్ డాలర్లు ఆర్జించేందుకు డిజైన్ చేయబడింది కాదు. అందుకే కళని, కళాకారులను ఆదరిస్తారే కానీ, పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లను కాదు’’ అంటూ నేడు చిత్ర పరిశ్రమ ఏ విలువలతో పనిచేయాలో కంగన రనౌత్ స్పష్టంగా చెప్పేశారు.

ఒకవేళ కళాకారులు కళ, సంస్కృతిని కలుషితం చేసే పనిలో పాల్గొంటున్నట్టు అయితే వారు దాన్ని సిగ్గు విడిచి కాకుండా విచక్షణతో చేయాలని కంగన సూచించింది. రెండేళ్ల నిషేధం తర్వాత మంగళవారం నుంచి కంగన ట్విట్టర్ ఖాతా తిరిగి పనిచేయడం ప్రారంభించింది. ఇన్ స్టా గ్రామ్ వేదిక చెత్త అని, తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ట్విట్టర్ చక్కని వేదిక అని ఆమె లోగడ చెప్పడం తెలిసిందే. మరి ఆమె చేసిన తాజా ట్వీట్ తో మళ్ళీ ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటుంది అనేది చూడాలి.
https://twitter.com/KanganaTeam/status/1618112581855776768?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1618112581855776768%7Ctwgr%5Edc50fc0809c2f002d10b2902131206bfde548a90%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763035%2Fkangana-ranaut-calls-film-industry-crass-day-after-return-to-twitter-slams-obsession-with-box-office-figures





Untitled Document
Advertisements