దోసకాయతో కీళ్ళ నొప్పులకు చెక్!

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 04:40 PM

దోసకాయతో కీళ్ళ నొప్పులకు చెక్!

మన ఆరోగ్యానికి కాయగూరలు ఎంతో శ్రేష్టమైనవి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కురగాయాలలో మరీ ముఖ్యంగా తీగజాతికి చెందిన కురగాయాలలో పోషకాలు మెండు. అటువంటి తీగజాతి కూరలలో ఒకటైన దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన కూరగాయ. దీనిలో నీటి శాతం ఎక్కువ పోషకాలు మెండు. ఈ దోసకాయ ఆరోగ్యానికే కాక మన చర్మ సౌందర్యానికి కూడా గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. దోసకాయ పచ్చడి, కూర ఇంకా పలు విధములుగా ఉపయోగ పడుతుంది. అనేక రోగములకు దోస- అమూల్యమైనది. నోటిలో దంతములు మరియు చిగుళ్ళ వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది. ముఖ్యముగా పయోరియోకు అమోఘమైనది
* శరీరములోని యూరిక్ ఆమ్లము అధికమైనప్పుడు సంభవించే కీళ్ళనొప్పులకు దోస మరియు కేరెట్ రసములుచేర్చిన మిశ్రమము ఔషధముగా ఉపయోగ పడుతుంది.
* తలమీది వెంట్రుకలు ఆరోగ్యముగా, నిగనిగలాడుతూ, ఒత్తుగా పెరగాలంటే దోస, కేరట్ మరియు తోటకూర ఈ రసములను చేర్చి వాడండి.
* పందిరి దోసకాయ ముక్కలతో ముఖమును రుద్దుకుంటే అది చర్మమును శుభ్రపరచి, చల్లగా, తాజాగా ఉంచుతుంది.
* వెచ్చని నీటితో ముఖమును కడుగుకొని, నాలుగైదు దోసకాయ ముక్కలతో ముఖమంతా రుద్దుకొని, శుభ్రమైనట్టి చన్నీటితో కడుక్కుంటే ముఖము నవనవ లాడుతూ హాయిగా వుంటుంది.





Untitled Document
Advertisements