‘ఆట పట్ల నమ్మకం ఉంచు’ అని చెప్పావు.. పాండ్యాతో శుభ్ మన్ గిల్

     Written by : smtv Desk | Thu, Feb 02, 2023, 11:47 AM

‘ఆట పట్ల నమ్మకం ఉంచు’ అని చెప్పావు.. పాండ్యాతో శుభ్ మన్ గిల్

శుభ్ మన్ గిల్ యువ బ్యాట్స్ మెన్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో ఈ పేరు మారుమోగిపోతుంది. అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ బుధవారం న్యూజిలాండ్ పై చేసిన శతక బాదుడుని ఫ్యాన్స్ బాగా ఆస్వాదించారు. 63 బంతులకు 126 పరుగులు చేసిన గిల్ నాటౌట్ గా నిలిచాడు. తనతోపాటు ఓపెనింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్, తన తర్వాత వచ్చిన త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా తక్కువ స్కోరుకే అవుటైనా, గిల్ మూలస్తంభం మాదిరిగా నిలిచి భారత్ విజయానికి తోడ్పడ్డాడు.
అందుకే ఈ మ్యాచ్ లో భారత్ 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉండడం కూడా విజయానికి ముఖ్య కారణమే. గిల్ తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల మోత మోగించాడు. గిల్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యుడు. అదే జట్టు కెప్టెన్ గా ఉన్న పాండ్యా టీమిండియా టీ20 జట్టును నడిపిస్తుండడం గిల్ కు కలిసొచ్చింది. గిల్ ప్రతిభ పట్ల పాండ్యా ఎంతో నమ్మకం ఉంచగా, దాన్ని అతడు నిలబెట్టుకున్నాడు.
తన ఆటతీరుపై మ్యాచ్ అనంతరం మైదానంలో పాండ్యాతో గిల్ మాట్లాడాడు. ‘‘టీ20ల్లో నా అంచనాలకు తగ్గట్టుగా నేను ఆడడం లేదు. మంచి ప్రదర్శన ఇవ్వాలనే ఆరాటంతో ఉన్నాను. మ్యాచ్ కు ముందు కావాల్సినంత విశ్వాసాన్ని నీవు నాకు అందించావు. ‘ఆట పట్ల నమ్మకం ఉంచు’ అని చెప్పావు. అది నాకు సాయపడింది. నేను ప్రాక్టీస్ చేసిన విధానం, మా నాన్న నాతో ప్రాక్టీస్ చేయించిన తీరు.. 90 శాతం క్రెడిట్ అతడికే వెళుతుంది’’ అని గిల్ చెప్పాడు.
https://twitter.com/cricketfanvideo/status/1620998617762004993?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1620998617762004993%7Ctwgr%5Ece6aca7df2d7842c17ee27728b1d762c1861dffc%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763596%2Fi-wasnot-living-up-to-my-expectations-in-t20is-but-you-gave-me-confidence-gills-heartfelt-message-for-hardik

Untitled Document
Advertisements