ఆఫీసులలో పనిచేసే మహిళలకు ఈ లక్షణం ఉండకుడదట!

     Written by : smtv Desk | Sat, Feb 04, 2023, 12:01 PM

ఆఫీసులలో పనిచేసే మహిళలకు ఈ లక్షణం ఉండకుడదట!

స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమే అనే మాట కొన్నేళ్లుగా చాలా ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో స్త్రీలు వెనకడుగు వేస్తూనే ఉంటారు. భూమ్మీద నుండి అంతరిక్షం వరకు స్త్రీ ఎదిగినప్పటికీ కొన్ని విషయాలలో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అందరు అని కాదు గాని కొంతమంది స్త్రీలు మాత్రం నేను స్త్రీని నేను ఇలాగే ఉండాలి అంటూ తమ చుట్టూ తామే గిరిగీసుకుని ఉంటారు. ముఖ్యంగా మగవారితో కలిసి మెలసి తిరిగే సమయాలలో.. అది ఏ విధంగా అంటారా .. ఒక సర్వే ప్రకారం ఇందుకోసం 300 మంది సీనియర్ స్థాయి అధికారులను పరిశీలించారు. వీరిలో 80 శాతం మంది పురుషులు, వారందరూ కరచాలనానికి ముందుగా చేతిని అందించిన వారే కాక, వీరిలో 88 శాతం పురుషులు, 31 శాతం మహిళలు కరచాలనంలో తమ చేతిని అధిక్యతా భావంతో పై చేయి గానే ఉంచారు. అధికారం, నియంత్రణ అన్నవి మహిళల దృష్టిలో అంతగా ప్రధాన విషయాలు అందుకే ప్రతి ముగ్గురు స్త్రీలలో కేవలం ఒక్కరు మాత్రమే పై చేయి అలవాటును కలిగి ఉన్నారు. తాము అణగిమణగి ఉన్నామనడానికి సంకేతంగా కొన్ని ప్రత్యేక సామాజిక పరిస్థితుల్లో మహిళలు పురుషులతో సుతిమెత్తగా కరచాలనం చేస్తుంటారు. తమ స్త్రీత్వాన్ని ప్రతిబింబింపజేయడానికి మహిళలు అనుసరించే మార్గమిది. ఇలా చేయడం వల్ల తమపై ఆధిక్యతని ప్రదర్శించవచ్చునని కూడా వారు పరోక్షంగా తెలియజేస్తుంటారు. కానీ వ్యాపార రంగంలో ఇలాంటి సంకేతాలివ్వడం ప్రమాదకరం. ఎందుకంటే పురుషులు అలాంటి మహిళల్లోని స్త్రీత్వానికే ప్రాధాన్యమిచ్చి, వృత్తిపరమైన ప్రతిభను నిర్లక్ష్యం చేస్తారు. వాణిజ్య సమావేశాల్లో తమ స్త్రీత్వపు చిహ్నాల్ని అతిగా ప్రదర్శించే మహిళల్ని అటు పురుషులతో పాటు, స్త్రీలు కూడా పట్టించుకోరు. స్త్రీ, పురుష సమానత్వపు సూత్రం. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దగా పనిచేయదు. అంత మాత్రాన వాణిజ్య రంగంలో రాణించాలనుకునే మహిళలు తమ సహజమైన స్త్రీత్వపు లక్షణాల్ని విడిచి పెట్టి, పురుషుల్లా మెలగాలని అర్ధం కాదు. ఇక్కడ మహిళలు సుతిమెత్తని కరచాలనాల్ని పొట్టి స్కర్టుల్ని, ఎత్తుమడమల పాదరక్షల్ని కాస్త దూరంగా ఉంచితే చాలు, వారు కోరుకునే విశ్వసనీయతను పొందగలరు.
ముఖ్యమైన వాణిజ్య సమావేశాల్లో స్త్రీత్వపు లక్షణాల్ని అతిగా ప్రదర్శించే మహిళలు తమ విశ్వసనీయతను కోల్పోతారు.
అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన విలియమ్ చాప్లిన్ 2001లో కరచాలనాలపై అధ్యయనం చేశారు. కలివిడిగా ఉండే వ్యక్తులు బలంగా కరచాలనం చేస్తే, సిగ్గరులు, అంతర్ముఖులు బలమైన కరచాలనాలకు దూరంగా ఉంటారని ఈ అధ్యయనంలో తేలింది. కొత్త ఆలోచనలకు సానుకూలురైన మహిళలు కూడా బలంగానే కరచాలనం చేస్తారని చాప్లిన్ తెలుసుకున్నాడు. కొత్త ఆలోచనల పట్ల సానుకూలత ఉన్నా, లేకున్నా పురుషులు బలంగా కరచాలనం చేస్తారు. కాబట్టి వాణిజ్య రంగంలో ముందుకు వెళ్ళాలనుకునే మహిళలకు, పురుషులతో బలంగా చేతులు కలపడమన్నది విజయానికి దగ్గరి దారిగా ఉపయోగపడుతుంది.

Untitled Document
Advertisements