వ్యామం ఏ సమయంలో చేస్తే అధిక ప్రయోజనాలు పొందవచ్చు

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 11:59 AM

వ్యామం ఏ సమయంలో చేస్తే అధిక ప్రయోజనాలు పొందవచ్చు

ప్రస్తుత కాలంలో గంటల తరబడి కుర్చుని పనిచేసే వారి సంఖ్య అధికమైపోతుంది. ఇలా గంటల తరబడి కదలకుండా కూర్చుని పని చేయడం వలన శారీరక శ్రమ అనేది పూర్తిగా తగ్గిపోయి ఉబకాయం భారీన పడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి. అబ్దుకే దాదాపు చాలావరకు వ్యాయయం చేయడం అనేది అలవాటుగా మార్చుకుంటున్నారు. అయితే రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాయామం చేసే వారు కూడా ఉన్నారు. ఇలా ఒక నియమిత వేళలు లేకుండా వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఉంటుందా? అనే విషయంపై శాస్త్ర వేత్తల్లోనూ ఆసక్తి ఏర్పడింది. దీంతో అసలు విషయం తెలుసుకుందామని చెప్పి వారు ఎలుకలపై ఒక అధ్యయనం నిర్వహించారు. వాటిని మనుషులతో పోల్చి చూశారు. ఉదయం వేళల్లో వ్యాయామాలు చేయడం వల్ల జీవక్రియలు మరింత చురుగ్గా ఉంటున్నట్టు గుర్తించారు.

కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ (స్వీడన్), యూనివర్సిటీ ఆఫ్ కోపెన్ హేగెన్ (డెన్మార్క్) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఎలుకలు చురుగ్గా ఉండే సమయంలో చేసే వ్యాయామాల వల్ల (విశ్రాంతి సమయంలో చేసే వాటితో పోలిస్తే’ జీవక్రియలు మెరుగ్గా ఉండడాన్ని గుర్తించారు. ఎలుకలు చురుగ్గా ఉండే సమయంలో చేసే వ్యాయామాలను, మనుషుల్లో ఉదయం చేసే వాటితో పోల్చి చూశారు.

మనుషులు రోజులో వివిధ వేళల్లో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంపై భిన్న రకాల ప్రభావాలు చూపిస్తున్నట్టు వీరు గుర్తించారు. కణాల సర్కాడియం రిథమ్ పై జీవక్రియల ప్రక్రియ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ‘‘జీవక్రియలను పెంచి, ఫ్యాట్ ను కరిగించడంలో ఉదయం చేసే వ్యాయామాలు సాయంత్రం చేసే వ్యాయామాలతో పోలిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటున్నట్టు తెలుసుకున్నాం. మా పరిశోధన ఫలితాలు అధిక బరువుతో ఉన్న వారికి ఉపయోగపడతాయి’’ అని ప్రొఫెసర్ జులీన్ ఆర్ జీరత్ పేర్కొన్నారు. శరీరంలో శక్తి సమతుల్యతకు, వ్యాయామాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలకు సరైన వేళలు అనేవి ముఖ్యమని, ఈ దిశగా మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రొఫెసర్ జీరత్ అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements