మధుమేహనికి దారితీసే ముఖ్య కారణాలు, వ్యాధి లక్షణాలు ఇవేనట !

     Written by : smtv Desk | Fri, Mar 01, 2024, 09:56 AM

మధుమేహనికి దారితీసే ముఖ్య కారణాలు, వ్యాధి లక్షణాలు ఇవేనట !

ప్రస్తుతకాలంలో షుగర్ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. చిన్న, పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాది బారీన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అందుకు కారణాలు అనేకం. వారి జీవిన శైలీ, ఆహారపు అలవాట్లు, మారిన పనివేళలు వంటివి కావచ్చు. అయితే
అలాంటి వారు తమ రోజువారి జీవితంలో కొన్నిమార్పులు చేసుకుని వాళ్ళ శరీరంలోని చక్కర స్థాయిలను నివారించుకోవచ్చును.
మనం తినే ఆహారంలో కూడా చక్కెర ఉంటుంది. మోతాదుకు మించిన ఆహారం తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే క్రమేనా మధుమేహంలోకి దించేస్తుంది. మనం తిన్న ఆహారం ద్వారా శరీరానికి అందే అదనపు చక్కెర కాలేయంలో నిల్వ ఉంటుంది. మనం భౌతికంగా శ్రమించినప్పుడు శరీరానికి అవసరమైన శక్తి చక్కెర ద్వారా లభిస్తుంది. అంటే, కాలేయంలో ఉండే చక్కెర శరీరానికి అందుతుంది. అయితే, కాలేయం సామర్థ్యాన్ని మించిన చక్కెరలను నిల్వ ఉంచలేదు. అదనంగా ఏర్పడే చక్కెరలను మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. తరచు మూత్రం వస్తుంటే.. తప్పకుండా అది మధుమేహానికి సూచన అని గుర్తించాలి. నిర్లక్ష్యం చేస్తే.. అది కిడ్నీలు (మూత్ర పిండాలు)పై ప్రభావం చూపుతుంది.

శరీరంలో పాంక్రియాస్ అనే అవయవం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను జీర్ణం చేయడంలో దీనిదే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్ గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ ఈ పాంక్రియాస్ పని. ఆహారం తింటేనే మన శరీరానికి శక్తి లభిస్తుందనే సంగతి తెలిసిందే. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. శరీరంలోని ప్రతి కణం జీవించి ఉండేందుకు, శక్తిని పొందేందుకు గ్లూకోజ్ ఎంతో అవసరం. అయితే.. ఇది శరీరానికి సరిపడేంతే ఉండాలి. ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. మనం ఎక్కువ ఆహారాన్ని తినేప్పుడు గ్లూకోజ్ అధిక స్థాయిలో తయారవుతుంది. అది కొవ్వు రూపంలోకి మార్చబడి నిల్వచేయబడుతుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ఇన్సులిన్ తప్పనిసరి. ఇందుకు కావల్సిన ఇన్సులిన్ క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల్లో ఉండే బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సూలిన్ లేకపోతే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం.. క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే.

మధుమేహానికి దారితీసే మరికొన్ని ముఖ్యమైన కారణాలు..

* సరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.
* కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహానికి గురవుతున్నారు.
* వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.
* మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’అంటారు.
* బాల్యం నుంచే సంక్రమించే మధుమేహాన్ని టైప్-1 డయబెటీస్ అంటారు.
* టైప్-1 డయాబెటిస్ సోకితే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి.
* వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, వారి ముందు తరాల నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.
* చూపు మందగిస్తుంది. పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి.శరీరంపై గాయాలు త్వరగా మానవు. అతిగా ఆకలి వేస్తుంది.
* తరచూ మూత్రం రావడం. దాహం ఎక్కువగా వేస్తుంది. గొంతు ఎండిపోతున్నట్లు ఉంటుంది.అకారణంగా బరువు తగ్గడం, బాగా నీరసం.
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటంశృంగార కోరికలు సన్నగిల్లడంచర్మం ముడత పడటం.
* కాళ్లలో స్పర్శ తగ్గుతుంది. కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు.
* టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.





Untitled Document
Advertisements