చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే రెండు సహజసిద్ద పదార్థాలు ఇవేనట!

     Written by : smtv Desk | Sat, Mar 02, 2024, 10:14 AM

చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే రెండు సహజసిద్ద పదార్థాలు ఇవేనట!

చర్మ సంరక్షణ విషయంలో నిమ్మరసం మరియు తేనే ఈ రెండింటికి చాలా ప్రాధాన్యముంది. మన ముందు తరాల వారు సైతం చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి వీటిని ఉపయోగించేవారు.

నిమ్మరసంతో.. నిమ్మరసంలో ఉన్న ఆస్కోర్బిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత కణాలను, ట్యాన్ ను తొలిగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి మనమేం చేయాలంటే.. బాగా ముగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని దానిలోని గింజలను తీసేయాలి. దీంతో ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరింత ఎక్కువ సమయం రుద్దుకోవాలి. రుద్దడం పూర్తయిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేయాలి.
ఆపై నూనెతో ముఖాన్ని రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకొంటున్నప్పుడు చర్మంపై పేరుకొన్న మురికి, మృతకణాలు, మట్టి వదిలిపోతాయి. ఆ తర్వాత చర్మం పూర్తిగా శుభ్రం కావడంతో.. అది అందంగా మెరిసిపోతుంది.

నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి ట్యాన్ ను పోగొట్టి చర్మాన్నిమెరిపిస్తాయి. దీనికి రోజ్ వాటర్, కీర దోస రసం కూడా కలిపితే.. ఎండలో వదిలిపోయినట్లుగా తయారైన చర్మానికి తిరిగి జీవకళ అందుతుంది. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ ను సైతం తగ్గిస్తుంది.టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, కీర దోస రసం, రోజ్ వాటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని ఫ్రిజ్ లో ఉంచిన నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

తేనెలో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్, ఇతర ఎంజైమ్లు చర్మం మీద ఉన్న మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తగ్గించి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముదిమి ఛాయలు రాకుండా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. దీనివల్ల స్కిన్ టెక్స్చర్ సైతం మెరుగుపడుతుంది





Untitled Document
Advertisements