రాత్రి మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారా? ఇకపై ఇలా చేయండి

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 11:24 AM

రాత్రి మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారా? ఇకపై ఇలా చేయండి

రాత్రి మిగిలిపోయిన అన్నం ఇలా చేస్తే చద్దన్నంగా మారుతుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని మనలో చాలా మంది పడేస్తుంటారు. అయితే అన్నం పడేయకుండా దాన్ని చద్దన్నంగా మార్చుకుంటే మంచిది. మన పూర్వికులు దీన్నే తినేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. వేసవిలో కచ్చితంగా తినాల్సిన వాటిలో చద్దన్నం ఒకటి. ఇది తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చద్దన్నాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

చద్దన్నం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
నీళ్లు - ఒక గ్లాసు
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
తరిగిన పచ్చిమిర్చి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు - అరకప్పు


రాత్రి మిగిలిన అన్నం తీసుకోవాలి. ఒక మట్టి కుండలో పెరుగు వేసి బాగా చిలకాలి.. అందులో నీళ్లు పోయాలి. ఆ తర్వాత అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదపకుండా అలా ఉంచాలి.
రాత్రంతా పెరుగు చక్కగా పులుస్తుంది. అందులో ప్రోబయోటిక్స్ ఉత్పత్తి అవుతాయి. ఉదయం లేచాక రాత్రి పులియబెట్టిన అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. దీన్ని ఊరగాయతో నంజుకొని తింటే టేస్ట్
చాల బాగా ఉంటుంది . ఈ చద్దన్నాన్ని వేసవిలో కచ్చితంగా తినాలి. ఇది అందరికీ నచ్చుతుంది.పిల్లలకు కూడా ఈ అన్నాన్ని తినిపించడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.
మన శరీరానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు ఈ ప్రోబయోటిక్స్ అవసరం పడతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. కాలేయానికి చద్దన్నం ఎంతో మేలు చేస్తుంది. చద్దన్నంలో క్యాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు ఎన్నో విటమిన్లు ఉంటాయి. వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చద్దన్నం తినడానికి ప్రయత్నించండి. వేడి శరీరంలో చేరదు. చలువ చేస్తుంది. అలాగే ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్సర్లు, పేగు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.





Untitled Document
Advertisements