అన్నంతో శివుడికి ఇలా చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుందట!

     Written by : smtv Desk | Wed, Mar 06, 2024, 06:45 AM

అన్నంతో  శివుడికి ఇలా చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుందట!

రెండు రోజుల్లో శివరాత్రి రాబోతుంది శివుడిని ఏ ద్రవ్యంతో అభిషికేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం.. సాధారణంగా శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. అందుకే భక్తులు శివుడిని నీటితో గానీ, పాలతోగాని అభిషేకిస్తుంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది.

శివుడుకి ఇష్టమైన వాటితో అభిషేకాలు చేయడం వలన కలిగే ఫలితాలు:

* గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు.
* ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
* ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
* నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
* పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును
* చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
* మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
* మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
* తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
* కోబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
* పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
* గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
* రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
* భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
* నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
* కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
* బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
* ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
* ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
* నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
* నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

ఇవే కాక అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ఆ అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది పూజ చేయుదురు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో ా బాగుంటుంది అన్న లింగార్చన. ఈ శివరాత్రి రోజు ఎవరికీ ఏది అందుబాటులో ఉంటుందో దానితో ఆ పరమ శివుడిని అభిషేకించి ,ఆయన కరుణ కటాక్షాలు పొందాలి.





Untitled Document
Advertisements