మూడు రకాల నియమాలతో కూడిన మహాశివరాత్రి ఉపవాస..

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 07:36 AM

మూడు రకాల నియమాలతో కూడిన మహాశివరాత్రి ఉపవాస..

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు . త్రిమూర్తులు ఒకరు శివుడు, బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారుడు శివుడు, శివుని హిందువులలో అనేక రూపాల్లో పూజిస్తూ ఉంటారు.

శివుడు జననమరణాలుకు అతీతుడు.కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే.విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు కూడా ఎప్పుడు శివలింగారాధన చేస్తుంటారు.పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు అని అర్థం. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం.ఇలాంటి పరమశివుని అనుగ్రహం పోందాటానికి మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే ఉపవాసాన్ని ఆచరించడంలో మూడు రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి.

అందులో అత్యంత కఠినమైన నిర్జల ఉపవాస వ్రతం కూడా ఉంది. ఈ నిర్జల ఉపవాస వ్రతంలో శివరాత్రి ప్రారంభం నుండి అంటే మార్చి 8వ తేదీ ఉదయం 12గంటల సమయం నుండి మార్చి 9వతేదీ సూర్యోదయ సమయం వరకు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం. ఇది చాలా కఠినతరమైన వ్రతం.
ఇక రెండవది పలహార వ్రతం.. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పాలు కొన్ని రకాలైన , పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్ తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు వండినవి ఉండకూడదు. పండ్లు, పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు.
మిగిలినది మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో ఫలహార వ్రతంలో పేర్కొన్న పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్ అన్నింటిని ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు. ఇక ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి. చాల మంది మూడవది అయినా సమాప్త వ్రతంను ఎక్కువగా ఆచరిస్తూవుంటారు . ఎవరి శక్తి కొలది వారు ఉపవాసము చేసి ఆ సదా శివుడి అనుగ్రహాము పొందాలి .





Untitled Document
Advertisements