దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంతంగా ఇళ్ళు లేదు.. బీజేపీ ఎంపీ

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 07:46 AM

దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధానికి సొంతంగా ఇళ్ళు లేదు.. బీజేపీ ఎంపీ

దేశప్రధాని నరేంద్ర మోదీ ఎంతటి నిరాడంబరులు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి నిమిషం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసే మహోన్నత వ్యక్తి. ప్రజల సొంతింటి కలను నిజం చేస్తూ దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి సొంతిల్లే లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్.. కొడుకునో, కూతురునో సీఎంగా చేయడానికి పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. రూ.500కే సిలిండర్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారన్నారు.

200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితంపై మాట తప్పారన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా కింద రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హామీలు ఉంటాయనే నమ్మకం లేదన్నారు. రైతు భరోసా డిసెంబర్‌లోనే ఇవ్వాల్సిందని.. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో కలిసే పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గడీలు బద్దలు కొట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అదే గడీల్లో తల దాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 12న తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని.. పోలింగ్ బూత్‌స్థాయి నేతల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం లక్ష్మణ్ చేసిన ఈ వాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పై ఆలోచనలో పడేసే విధంగా ఉన్నాయి.





Untitled Document
Advertisements