స్టీలు పాత్రలలో వంట చేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు అసలు చేయకండి

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 02:49 PM

స్టీలు పాత్రలలో వంట చేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు అసలు చేయకండి

పూర్వ కాలంలో మట్టి పాత్రలను వంట చేయడానికి వాడే వారు . కానీ ఇప్పుడు ఎక్కువగా చాలామంది వంట కోరకు స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏ పాత్రలు వాడాలి అని రకరకాల అనుమానాలతో ప్రజలు సతమతమవుతున్నారు. మనం తీసుకునే ఆహారం అన్నీ కూడా పచ్చిగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే మనం వంట చేసే విధానం మన ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాo.ఆహారాన్ని వండడానికి వినియోగించే వస్తువులు కూడా మన శరీర ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. సహజంగా వంట వండడం కోసం స్టీల్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే స్టీలు పాత్ర మంచిదని అందరి అభిప్రాయం. కానీ ఈ పాత్రలు సరిగ్గా వినియోగించకపోతే ప్రాణానికి ప్రమాదం తప్పదు.. కావున స్టీలు పాత్రలు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నాన్ స్టిక్ వంట సామాన్ల కంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో ఆహారం వేడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉడికించే ముందు మీడియం మంట మీద వేడి చేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలోకి వడ్డించాలి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో వంట చేయడానికి నాన్ స్టిక్ కంటే ఎక్కువ నూనె అవసరం పడుతుంది. లేదంటే ఆహారం ఫ్యాన్ కి ఆత్తుకుపోతూ ఉంటుంది. మార్చురైజర్స్ ఆహారాలు స్టెయిన్లెస్ కుక్ వేరు ప్యాన్ కు అంటుకుంటే అధిక గ్యాప్ వేడిని తగ్గిస్తుంది. ఇది పాన్ నుండి ఆహారం బయటికి పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి వంట చేయడానికి నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను వినియోగించాలి. దీంతో వంటకాలు ఎక్కువసేపు పాడవ్వకుండా ఉంటాయి.

ఆహారం కూడా నాణ్యమైనదిగా రుచిగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాన్ లో పంచదార పాకం తయారు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది.. తక్కువ నాణ్యత గల స్టీల్ పాత్రలలో అయితే పంచదార పాకం వెంటనే మాడిపోతుంది. స్టైన్లెస్ స్టీల్ పాత్రలో ఒకేసారి అధిక పదార్థాలను వేడి చేయవద్దు. ఆహార పదార్థాలు ఒక్కొక్కటిగా జోడించి దశలవారీగా ఆహారాన్ని ఉడికించుకుంటే ఆహారం సమతుల్యంగా ఉడుకుతుంది. కాబట్టి స్టీల్ పాత్రలు వినియోగించేటప్పుడు వాటి నాణ్యతను చెక్ చేసుకుని తెచ్చుకొని దానిలో వంట చేసుకోండి.. ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు.

ఏ పాత్రలు వాడిన వాటిని క్లీన్ చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉంటుంది . అన్నింటి కంటే మట్టి పాత్రలు వాడడం చాల మంచిది కానీ ఈ రోజుల్లో మట్టి పాత్రలు స్టవ్ మీద పెడితే వేడి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. మన వాడే సిలిండర్ అయిపోతుంది .





Untitled Document
Advertisements