దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ కనపడాలంటే ఇలా చేయండి..

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 11:48 AM

దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ కనపడాలంటే ఇలా చేయండి..

మనం ఎంత అందంగా ఉన్న మన పళ్ళు చూడడానికి తెల్లగా లేకపోతే మంచిగా కనపడరు . కొంత మందికి పళ్లు పచ్చగా ఉంటాయి. పళ్లపై చారలు ఏర్పడుతాయి. ఇలాంటి వాళ్లు తమ పళ్లు తెల్లగా లేవని బాధ పడుతుంటారు. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వడానికి ఇష్టపడరు ఏదో తప్పు చేసినట్లు అనుకుంటారు. దీనికి కారణం ఏమైనా కావచ్చు మనం వాడే వాటర్ లో PH స్థాయి ఎక్కువగా ఉంటే ఎంత తోమిన పళ్ళు పచ్చగా గారలు పడతాయి . అలాంటి వాళ్లు ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే పళ్లు తెల్లగా మారడానికి పనికొచ్చే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం..?
మన డైలీ వాడే టూత్‌ పేస్టులో (Tooth paste) ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక రాపిడి ఏజెంట్‌గా పని చేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పళ్లు తెల్లగా లేని వాళ్లు
మొదట ఉప్పుతో రోజూ ఒకటి రెండు నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దుకోవాలి. గట్టిగా రుద్దితే పళ్లపై ఉన్న ఎనామిల్‌ అరిగిపోయే ప్రమాదం ఉంది. ఆతర్వాత పేస్ట్ తో తోముకోవాలి . అప్పుడు దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ కనపడతాయి .

అదేవిధంగా తెల్లటి దంతాల కోసం మన ఇంట్లో లభించే కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోట్లో వేసుకుని పుక్కలించాలి . కాసేపటి తర్వాత నూనెను ఉంచేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్లపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది. కావిటీస్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయాన్ని తగ్గిస్తాయి. మన నోట్లో ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది .

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి దాంతో పుక్కలించాలి దీని వలన దంతాలపై ఉన్న మరకలు తగ్గిపోతాయి. అయితే వెనిగర్‌కు ఆమ్ల స్వభావం అధికం, నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్‌ క్షీణిస్తుంది. ఎనామిల్ పోతే దంతాలు పాడుఅవుతాయి కాబట్టి దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మౌత్‌ వాష్‌లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

బేకింగ్ సోడాను పేస్టుగా చేసి వాడితే కూడా పళ్లు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్‌ సోడా పేస్టుతో దంతాలను రోజూ సున్నితంగా 1 నుంచి 2 నిమిషాలపాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలీన్ స్వభావం నోటిలోని PH స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది.ఏ చిన్న చిన్న చిట్కాలను వాడుకొని మన పళ్ళను తెల్లగా చేసుకోవచ్చు . అంతేకాకుండా వీటి వలన దంతాల సమస్యలు కూడా రావు నోట్లో ఎలాంటి చేడు వాసన రాదు .
ముఖ్యంగా చిన్న పిల్లల చాక్లెట్స్ తినడం వలన క్యావిటీస్ వస్తాయి దాని నుండి ఉపశమనం పొందవచ్చు .





Untitled Document
Advertisements