మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్ టార్గెట్ ..

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 07:54 PM

మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్ టార్గెట్ ..

సూపర్స్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇప్పుడు మూడోసారి ఇంటర్ నేషనల్ అవార్డు కోసం గురి పెట్టాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇండియన్ హీరోల్లో ఏ హీరోకి లేని ఒక సెపరేట్ క్వాలిటీ ధనుష్ లో ఉంటుంది. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని ఈ హీరో ఇలాంటి సినిమాలే చేస్తాడు.. ఈ హీరో ఇలాంటి పాత్రలకే సూట్ అవుతాడు లాంటివి ధనుష్ విషయంలో ఉండవు. కథ బాగుందా క్యారెక్టర్ ఎక్కిందా అంతే ధనుష్ అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. తన మామ లాగా ఎలాంటి పాత్రలకు అయినా సూట్ అవుతాడు . డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే నటుల్లో ధనుష్ ఒకరు. అందుకే అతను హీరోగా కన్నా నటుడిగా అందరు గుర్తిస్తారు. కోలీవుడ్ లో తనదైన సినిమాలు చేస్తూ కమర్షియల్ రికార్డులనే కాదు అవార్డులు రివార్డులు అందుకుంటున్నాడు ధనుష్. ఈ విలక్షణ నటుడు చేసిన ఆడుకలం సినిమా 2011లో రిలీజైంది. ఆ సినిమాలో అతని నటనకు నేషనల్ అవార్డు వచ్చింది.

అసురన్ సినిమాతో మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్ నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాతో నేషనల్ అవార్డ్ మీద గురి పెట్టాడు ధనుష్. ఫస్ట్ లుక్ తోనే ధనుష్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. శేఖర్ కమ్ముల కథనే చెప్పబోతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. ధనుష్ కి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. అందుకే ఫస్ట్ లుక్ చూడగానే వావ్ అనేశారు ఆడియన్స్.

కుబేర సినిమాలో ధనుష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని తెలుస్తుంది. అదే నిజమైతే ఈసారి కూడా ధనుష్ చెంతకు నేషనల్ అవార్డ్ వచ్చి చేరుతుందని చెప్పొచ్చు. నటుడిగా తన మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు డిజప్పాయింట్ చేయని ధనుష్ సినిమా సినిమాకు ఛాలెంజింగ్ రోల్స్ తో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమాతో పాటుగా రాయన్ సినిమా కూడా చేస్తున్నాడు. రాయన్ సినిమా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కుబేర సినిమాలో కింగ్ నాగార్జున, రష్మిక కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల తన కెరీర్ లో భారీగా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.మరి ఈ సినిమాతో ధనుష్ మరోసారి జాతీయ ఉత్తమ నటుడిగా
నేషనల్ అవార్డు అందుకుంటాడా చూడాలి మరి .





Untitled Document
Advertisements