ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఉంటే లవంగాలతో చెక్

     Written by : smtv Desk | Wed, Mar 13, 2024, 08:05 PM

ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఉంటే లవంగాలతో చెక్

ఇల్లును చూసి ఇల్లాలును చూడండి అని మన పెద్దలు చెపుతారు . ఎందుకంటే మన ఇల్లు ఎంత నీట్ గా ఉంటే వారు అంత సంప్రదాయంగా ఉన్నట్టు అర్థం. కానీ కొన్ని సమయాలలో మనకు తెలియకుండానే ఇళ్లలో, వంటగదిలో కీటకాలు, బల్లులు, బొద్దింకలు అవి వస్తాయి . ఎలా అంటే శీతాకాలం ముగిసింది. వాతావరణంలో ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. వేడి పెరిగేకొద్దీ బొద్దింకలు, బల్లులు ఇతర కీటకాల ఇంట్లోకి చేరడం పెరుగుతుంది. మేజర్ గా వంటగది లో ఎక్కువగా కనపడతాయి . అయితే చాలా ఇళ్లలో వంటగదిలో కీటకాలు, బల్లులు, బొద్దింకలు పెద్ద సమస్యగా తయారవుతాయి. బల్లులు, బొద్దికలను కిచెన్ నుంచి తరిమేసేందుకు వందల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం కనిపించదు. అందుకే మీకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో వాటికి చెక్ పెట్టవచ్చని చూపిస్తున్నాం


మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో బల్లి సాంబార్, కూరల్లో పడిపోవడం వల్ల వాటిని పారేయడం చూస్తుంటాం. ఎందుకంటే బల్లి పడిన ఆహార పదార్ధాలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి వాటిని పారేయడం జరుగుతంది.
గుడ్డు పెంకులు..
బల్లులను తరిమికొట్టడంలో కోడిగుడ్డు పెంకులు చాలా సహాయపడతాయి. మీరు కిటికీలో గుడ్డు పెంకులను ఉంచడం వల్ల ఫలితం కనిపిస్తుంది. అలాగని కుళ్లిపోయిన కోడి గుడ్డు పెంకులు కాకుండా ప్రతీ వారం ఎప్పటికప్పుడు మారుస్తూ ప్రెష్ కోడిగుడ్డు పెంకులు ఉంచడం వల్ల కిచెన్ లో దుర్వాసన ఉండదు.
ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, తొక్కలు..
కీటకాలు, బొద్దింకలు కిచెన్ నుంచి తరిమివేయడానికి ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించండి. మీరు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తొక్కలను తలుపు మీద వేలాడదీయవచ్చు. గది మధ్యలో ఫ్యాన్ దగ్గర చిన్న టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. తీవ్రమైన వాసనతో కీటకాలు ఆకర్షితులవుతాయి.
నాఫ్తలీన్ ఉండలు..
నాఫ్తలీన్ గోలీలు కూడా బల్లులతో పాటు ఇతర కీటకాలను నివారిస్తాయి. అయితే వీటిని పిల్లలకు అందకుండా నాఫ్తలీన్ గోలీలను బొద్దింకలు, బల్లులు చేరే ప్రదేశాల్లో ఉంచాలి.దాని స్మెల్ కు అవి పారిపోతాయి .
ఎర్ర మిరియాలు..
మీరు ఎర్ర మిరియాలు ఉపయోగించి ఇంట్లో క్రిమి వికర్షక స్ప్రేని తయారు చేసుకోవచ్చు. ఎర్ర కారం పొడిని గ్రైండ్ చేసి నీళ్లలో కలపాలి. ఈ స్ప్రే బల్లులను చికాకుపెడుతుంది. ఇది వాటిని దూరంగా ఉంచుతుంది.
లవంగాలు
బొద్దింకల్ని తరిమికొట్టడానికి లవంగాలను ఉపయోగించవచ్చు. వంటగదిలో లవంగాలను ఉంచండి. అంతేకాకుండా, కిరోసిన్ నూనె వాసనకు కూడా బొద్దింకల్ని​​దూరంగా ఉంచేలా చేస్తుంది.
మరి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మార్కెట్‌లో అనేక రకాల పురుగుల నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని వంటగదిలో నుండి బల్లులను బొద్దింకలను దూరం చేయాలి . లేదు అంటే వేట వలన అనేక రకాలైన రోగాలు వస్తాయి .





Untitled Document
Advertisements