ఈ టిప్స్ పాటిస్తే షుగర్ పేషేంట్స్ ఎటువంటి భయం లేకుండా స్వీట్స్ తినొచ్చు

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 09:47 AM

ఈ టిప్స్ పాటిస్తే షుగర్ పేషేంట్స్ ఎటువంటి భయం లేకుండా స్వీట్స్ తినొచ్చు

శుభకార్యానికైనా, పండుగలకైనా, ఏ చిన్న ఫంక్షన్ జరిగిన మొదట చేసేది స్వీట్స్‌. నిజానికి చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళవరకు స్వీట్స్‌ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చక్కెర ఎక్కువగా తినకూడదనే ఉద్దేశంతో స్వీట్స్ త్యాగం చేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇలా చేయకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే స్వీట్స్‌ హెల్తీగా తయారు చేసుకోవచ్చు.

ఒక్కోసారి తియ్యటి పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.కానీ దానిలో చక్కెర, ఉండడం వలన ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. దీంతో చాలా మంది చక్కెరకు దూరంగా ఉంటారు. మీరు స్వీట్‌ లవర్స్‌ అయితే.. మీ నోరు కట్టేసుకోవలసిన పనిలేదు. మీరు రుచికరమైన, పోర్షన్‌ కంట్రోల్‌ చాలా ముఖ్యం. మీరు డెజర్ట్‌లను రుచికరంగానే కాకుండా, ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.​

మీరు స్వీట్స్‌ తయారు చేసుకోవడానికి.. ప్రాసెస్జ్‌ ఫ్లోర్‌కు బదులుగా తృణధాన్యాల పిండి, బాదం, కొబ్బరి పిండి వంటివి ఎంచుకోండి. తృణధాన్యాల్లో ఫైబర్‌, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్థిరమైన శక్తిని అందిస్తాయి.

శుద్ధి చేసిన చక్కెరలకు బదులుగా తేనె, మాపుల్ సిరప్, ఖర్జూరం వంటివి ఎంచుకోండి. ఇవి మీ డెజర్ట్స్‌కు తియ్యటి రుచిని అందించడమే కాదు.. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి.

మీ డెజర్ట్స్‌కు సహజమైన తీపిని జోడించడానికి.. మీ డెజర్ట్‌లలో తాజా, ఎండిన పండ్లను చేర్చండి. బెర్రీలు, యాపిల్‌, అరటిపండ్లు వంటి యాడ్‌ చేసుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్, అవకాడో లేదా నట్ బటర్స్ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా సంతృప్త కొవ్వులను తగ్గించండి. ఈ కొవ్వులు అవసరమైన పోషకాలను అందిస్తాయి. మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మీ డెజర్ట్‌లలో పోషక పదార్థాలను పెంచడానికి.. చియా గింజలు, అవిసె గిజలు వంటివి చేర్చండి. ఈ పదార్థాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి.

అదేవిధంగా షుగర్ కు బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చును దానిలో మంచి ఐరన్ ఉంటుంది . ఈ చిన్న మార్పుల వలన షుగర్ పేషెంట్స్ కూడా ఎంతో ఇష్టంగా స్వీట్స్ చేసుకొని తినవచ్చును.

మీ మీ షుగర్ లెవెల్స్ ని బట్టి స్వీట్స్ ఈ రకంగా తయారుచేసుకుని తినడానికి ముందు ఓసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే మరీ మంచిది.





Untitled Document
Advertisements