ఒంట్లోని కొవ్వుని కరిగించడంలో ఈ చిరుధాన్యాలు బెస్ట్..

     Written by : smtv Desk | Sat, Mar 16, 2024, 06:34 AM

ఒంట్లోని కొవ్వుని కరిగించడంలో ఈ చిరుధాన్యాలు బెస్ట్..

మన పూర్వికులు ఎక్కువగా చిరుధాన్యాలు అని పిలువబడే జొన్నలు , కొర్రలు ,అరకలు, సజ్జలు, రాగులు, తినే వారు కాబట్టి వారు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాలేదు . ఈమధ్య కాలంలో ఎక్కువగా వైట్ రైస్ తినడం వలన అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ప్రోటీన్స్ తక్కువగా ఉండడం వలన షుగర్ లాంటి డిసీస్స్ తో చాల చిన్న వయస్సులో బాధ పడుతున్నారు . అంతే కాకుండా బరువు పెరుగుతున్నారు . ప్రస్తుతం బరువు తగ్గడం ఎంత ముఖ్యమో.. హెల్దీగా తగ్గడం కూడా అంతే ముఖ్యం. అలా హెల్దీగా బరువు తగ్గాలంటే మంచి ఫుడ్‌ని ఎంచుకోవాలి.

ఇప్పుడు కాదు కానీ, ముందు కాలంలో సజ్జలని ఎక్కువగా తినేవారు. నేటి కాలంలో చాలా మందికి వీటి గురించి తెలియనే తెలియదు. కానీ, ఇందులో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. వీటిని మీ రోజువారీ డైట్‌ల చేర్చుకుంటే చాలా మంచిది.
సజ్జల్లో ముఖ్య పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి . ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. పైగా ఇవి గ్లూటెన్ ఫ్రీ. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చాలా సేపటి వరకూ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే జంక్ ఫుడ్ తినాలనిపించదు
​గోధుమలతో పోలిస్తే సజ్జలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. సజ్జలలో విటమిన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ ఎంజైమ్స్‌ని ఉత్తేజపరిచి రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి.
ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇది కండరాల సమస్యల్ని దూరం చేసి కండరాలను పెంచుతాయి. అంతేకాకుండా కేలరీలను బర్న్ చేస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు.బరువుని తగ్గించడంలో సజ్జలు ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. . ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాడీకి శక్తిని అందిస్తాయి. అయితే, క్యాలరీలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. డైటింగ్ చేసేవారు ఎందుకు తినాలో తెలుసుకోండి.

సజ్జలలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి, షుగర్ ఉన్నవారు వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఉదర సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారమని చెప్పొచ్చు. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

పైన చెప్పినట్టుగా బరువు తగ్గాలి అనుకునే వారు హెల్తి ఫుడ్ తీసుకొని ఈజీగా తగ్గవచ్చును . ఈ సజ్జలను మనం అనేక రూపాలలో వాడుకోవచ్చును సజ్జ రోటీగా కానీ దోశ రూపంలో కానీ జావ రూపంలో కానీ తీసుకోవడం అలవాటుగా మార్చుకోవడం మంచిది.





Untitled Document
Advertisements