క్రీడాకారుడిగా కనిపించనున్న మెగా పవర్ స్టార్..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 02:34 PM

క్రీడాకారుడిగా కనిపించనున్న మెగా పవర్ స్టార్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మగధీర సినిమాతో తండ్రిని మించిన తనయుడు అన్న పేరు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా వరుస హిట్లతో బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి . ప్రస్తుతం తన 16వ చిత్రం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క త్వంలో ఓ రా అండ్ ర‌స్టిక్ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 20న సినిమా ప్రారంభం కానుంది.ఈ సినిమాలో ఓ ఆట‌ను కేంద్రంగా చేసుకుని బ‌ల‌మైన భావోద్వేగ‌తంతో తెర‌కెక్కించబోతున్నారుట‌. ఇందులో చ‌ర‌ణ్ క్రీడాకారుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.
ఆ ఆట క‌బ‌డ్డీ లేదా పుట్ బాల్ నేప‌థ్య‌మ‌ని లీకులందుతున్నాయి. ఇదే నిజ‌మైతే చ‌ర‌ణ్ తొలిసారి క్రీడాకారుడి రోల్ ఇదే అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర‌లు ఆయ‌న పోషించ‌లేదు. ఈ తరహా పాత్రలో మెగా పవర్ స్టార్ ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలి .
మార్చి 20న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరపడంతో పాటు ప్రెస్‌మీట్ కూడా నిర్వహించబోతున్నారని టాక్. ఇక ఈ వేడుక‌కు టాలీవుడ్ స్టార్ హీరో కూడా రానున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ సినిమాకు ‘పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే మర్చి 20 వరకు వెయిట్ చేయాల్సిందే.మెగా పవర్ స్టార్ ఫాన్స్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎదురుచూడాలి.












Untitled Document
Advertisements