పేరడీ మీమ్ పై స్పందించిన ఆశ్విన్..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:26 PM

పేరడీ మీమ్ పై స్పందించిన ఆశ్విన్..

ఒకే ప్రాంతానికి చెందిన మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కు, టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మధ్య మనస్పర్థలు అందరికీ తెలిసిందే. గతంలో శివరామకృష్ణన్అశ్విన్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల అశ్విన్ 500 వికెట్ల మైలురాయి నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అభినందించేందుకు తాను ఫోన్ చేస్తే అశ్విన్ కాల్ కట్ చేశాడని ఆరోపించాడు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడని, మెసేజ్ పంపించినా రిప్లయ లేదని తెలిపాడు. ఇదీ.. మాజీ క్రికెటర్లకు వీళ్లిచ్చే గౌరవం! అంటూ అశ్విన్ పై రుసరుసలాడాడు.

ఈ నేపథ్యంలో, అశ్విన్ ఓ పేరడీ అకౌంట్ లో వచ్చిన మీమ్ కు స్పందించాడు. అందులో శివరామకృష్ణన్ ఫొటో మీద కాల్ మీ ప్లీజ్ అని రాసి ఉంది. దీనిపై అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఓకే సర్.. ఎక్కడ, ఎప్పుడు అనేది నిర్ణయించిన తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
అశ్విన్, శివరామకృష్ణన్ ఇద్దరూ తమిళనాడుకు చెందినవారే అయినప్పటికీ, తన సలహాలను అశ్విన్ స్వీకరించడంలేదన్న కోపం శివరామకృష్ణన్ లో ఎప్పటినుంచో ఉంది. మరి అశ్విన్ స్పందించిన తీరుకి శివరామకృష్ణన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.


Untitled Document
Advertisements