స్టీలు పాత్రలు ఎవరికీ కాలిగా తిరిగివ్వకూడదట.. ఇస్తే సమస్యల్లో పడ్డట్టే!

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 07:42 AM

స్టీలు పాత్రలు ఎవరికీ కాలిగా తిరిగివ్వకూడదట.. ఇస్తే సమస్యల్లో పడ్డట్టే!

పూర్వకాలంలో అందరు ఏది చేసిన అందరికి పంచి పెట్ వారు . అలాగే కొంత మందికి మనం ఏవి తినడానికి చేసిన మన పొరుగువారికి పంచుకునే అలవాటు ఉంటుంది .ఎప్పుడైనా పండగలు , ఫంక్షన్స్ జరిగినప్పుడు కూరల్నీ లేకా స్వీట్స్‌ను పంచుకునే అలవాటును కలిగి ఉంటారు. అప్పుడు వారు ఇచ్చిన పాత్రను తిరిగి ఇచ్చేటపుడు ఖాళీ పాత్రలు అసలు ఇవ్వకూడదు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి.
ఆహారం విషయంలో చాలా నియమాలు పాటిస్తాం. భోజనానికి ముందు ప్లేటులో ఉప్పు వేయడం, ఒకదాని తర్వాత ఒకటి వడ్డించడం ఇలా కొన్ని నియామాలను మనం పాటిస్తాం. దానితో పాటు మన ఆహారాన్ని పక్కింటివారికి పంచుకునే సంప్రదాయం మనకు కూడా ఉంటుంది..ఎవరైనా మనకు డబ్బాలో ఏదైనా ఆహారాన్ని ఇస్తే. మనం కూడా ఆ డబ్బాలో ఇంట్లో తయారుచేసిన కొన్ని వస్తువులను అందులో వేసి ఇస్తాం.ఎందుకంటే ఆలా ఖాళీ గ ఇవ్వాలి అంటే చాల మందికి నచ్చదు . ఒకవేళ ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేకుంటే గిన్నెలో పంచదార వేసి ఇస్తారు. అలాగే మనం ఎవరికైనా ఇస్తే వాళ్లు కూడా అలానే ఇస్తారు. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ఖాళీ పాత్ర ఎవరికీ ఇవ్వకూడదనే నమ్మకం. కాబట్టి మనం ఎవరికీ ఖాళీ పాత్రలను ఎందుకు ఇవ్వకూడదో చూద్దాం.

ఓ నమ్మకం ప్రకారం, మనం ఎవరికైనా ఖాళీ పాత్ర ఇస్తే అది మన పరిస్థితిని సూచిస్తుందట. ప్రాథమికంగా దీని అర్థం మీరు ఇవ్వడానికి ఏమీ లేదు, మీరు పేదవారని భావిస్తారట. ఒకరకంగా ఇది ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఈ ఒక్క నమ్మకం ఆధారంగా ఖాళీ పాత్రలు ఎవరికీ ఇవ్వకూడదని నమ్ముతుంటారు.

మన జీవితంలో ప్రతిదీ గ్రహాల ద్వారా నిర్ణయించబడుతుంది. సూర్యుడు, కుజుడు రాగి పాత్రను సూచిస్తారు. అదే సమయంలో, వెండి పాత్రలు చంద్రునితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. కాబట్టి ఖాళీ పాత్రలు ఇస్తే ఈ గ్రహాల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తారు.

ఈ పాత్రలను ఖాళీగా ఉంచితే జాతకంలో చంద్రుడు, కుజుడు, సూర్యుడి బలం తగ్గుతుందని చెబుతారు. చంద్రుడు బలహీనంగా మారడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల మీరు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మీరు స్టీల్ పాత్రలను ఖాళీగా ఇస్తే రాహువు కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు అని నమ్మకం . ఇలా కాకుండా ఖాళీ కంటైనర్లు ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఖాళీ పాత్రలను ఇవ్వడం వల్ల గ్రహ కోపం వస్తుంది తద్వారా మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి. కుజుడు కారణంగా, మీరు పెట్టుబడిలో నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది..మీకు జ్యోతిష్యం మీద నమ్మకం లేక పోయిన ఖాళీ పాత్రలు ఇవ్వడం అంత మంచి పద్దతి కాదు . ప్రేమతో మనకు ఏదైనా ఇచ్చినప్పుడు,వారికీ కృతజ్ఞతగా మనం ఏదైనా ఇస్తే మంచిది. మీరు మీ పొరుగువారికి ఖాళీ బాక్స్‌ను తిరిగి ఇస్తే, అది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. కాబట్టి ఇవ్వడానికి ఏమీ లేకుంటే పంచదార లేదా పండ్లు ఇవ్వాలి. అప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ బాగా ఉంటుంది





Untitled Document
Advertisements