ఇలా చేస్తే అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 08:15 AM

ఇలా చేస్తే అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది..

ప్రతి ఒక్కరి వంటగదిలో అల్లంవెల్లులి పేస్ట్ తప్పనిసరిగా ఉంటుంది. దీనిని డైలీ వివిధ వంటకాల్లో యూజ్ చేస్తుంటాం . ఇక మాంసాహారం వంటల్లో అయితే అల్లం వెల్లులి పేస్ట్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేని వంటకాలను అసలు ఊహించుకోలేరు. అదే విధంగా కొంత మంది ఓన్లీ అల్లం ను కూడాఎక్కువగా వాడుతుంటారు. పరగడుపున అల్లం వాటర్​ తాగితే అన్ని ఆరోగ్య సమస్యలన్నీ పరారు అవుతాయి అందుకని చాల మంది దీన్ని తాగుతారు .అల్లంలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, దీని ధర మార్కెట్​లో మిగతా మసాలా దినుసుల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఇది అధిక వేడి కారణంగా త్వరగా పాడైపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అల్లాన్ని ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే జింజర్​ను చాలా కాలం ఎండిపోకుండా ఫ్రెష్​గా స్టోర్ చేసుకోవ చ్చు . ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫ్రెష్ అల్లం కొనండి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అల్లం కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా చూడకుండా కొనేస్తుంటారు. అయితే, అల్లం త్వరగా పాడైపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని జింజర్ కొనుగోలు చేసేటప్పుడు ఫ్రెష్​గా ఉండే అల్లాన్ని ఎంచుకోవాలి. అంటే గట్టిగా, మందంగా, లేతగా ఉండే దాన్ని కొనుగోలు చేయాలి . అంతేకానీ, మెత్తగా, రంధ్రాలున్న, ముడతలు పడిన అల్లాన్ని తీసుకోవదు ఎందుకంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది .అంతేకాకుండా అల్లం ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని అల్లంపై పొట్టు తీయవద్దు . మన అవసరానికి కావాల్సిన దాన్ని పొట్టు తీసి వాడుకోవాలి. మిగతా దాన్ని పొట్టు తీయకుండా ఉంచుకోవాలి. పైపొట్టు అల్లానికి రక్షణగా ఉంటూ ఎక్కువకాలం పాడవకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.

మీరు అల్లాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి మరొక సులభమైన మార్గం.. రిఫ్రిజిరేటర్​లో స్టోర్ చేయడం. ఇలా స్టోర్ చేసే ముందు అల్లాన్ని పొట్టు తీయకుండా లేదా తీసి నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ పొట్టు తీసి స్టోర్ చేసుకోవాలంటే ముందుగా జింజర్​ను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లేదా గాలి పోని కంటైనర్​లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే బ్యాగ్​ను క్లోజ్ చేసే ముందు దాంట్లో గాలి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది తేమ పెరగకుండా నిరోధిస్తుంది.

ముక్కలు గట్టిగా చేసి స్టోర్ చేసుకోవడం : మీరు అల్లాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడాని ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది . ఇందుకోసం ముందుగా అల్లాన్ని పొట్టు తీసి ముక్కలుగా చేసి లైనింగ్ బేకింగ్ షీట్లో ఉంచాలి. ఆపై ముక్కలు గట్టిగా ఉండే వరకు ఫ్రీజర్​లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసి గాలి పోని కంటైనర్​కు మార్చుకొని రిఫ్రిజిరేటర్​లో స్టోర్ చేసుకోవాలి. ఇవేకాకుండా అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దాన్ని ఎప్పుడూ ఎక్కువ వేడి ఉన్న ప్రదేశం ఉంచకుండా చూసుకోవాలి . అదే విధంగా అల్లాన్ని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టి దాన్ని పొడిలా చేసుకోవడం ద్వారా కూడా ఎక్కువ కలం నిల్వ ఉంటుంది . ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలతో అల్లం పాడు అవ్వకుండా చూసుకోవచ్చు .





Untitled Document
Advertisements