పిల్లలకు ఇష్టమైన రైస్ బాత్ ఈజీగా టేస్టీగా..

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 10:39 AM

 పిల్లలకు ఇష్టమైన  రైస్ బాత్  ఈజీగా  టేస్టీగా..

ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి కదా పిల్లలకి డిఫరెంట్ గా ఉండేటట్లు రైస్ చేసే పెడితే ఇష్టంగా తింటారు . అంతేకాకుండా ఇంట్లోనే హోటల్‌లో దొరికే రైస్ బాత్‌ టేస్ట్‌తో చేయవచ్చు ఈ రైస్ బాత్ ముఖ్యంగా ఉదయం అల్పాహారానికి రుచికరంగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా తినవచ్చు. ఇది చేయడానికి కావలసిన పదార్థాలు . రైస్ బాత్ తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం..

రైస్ బాత్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ - చిన్నది, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, లవంగాలు, ఏలకులు, టొమాటో, కొత్తిమీర, కొబ్బరి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఆకుపచ్చ బటానీలు, బీన్స్, కారెట్, బంగాళదుంప, బియ్యం, పుదీనా ఆకులు

రైస్ బాత్ తయారీ విధానం:

ముందుగా మనకు కావలసినంత రైస్ ని శుభ్రంగా కడిగి పాకాన పెట్టుకోవాలి . తర్వాత బాణలిలో నూనె వేసి వేడయ్యాక చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి అల్లం వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, రేకులను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత టొమాటో వేసి వేయించాలి.
కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, కొబ్బరి పొడి వేసి బాగా వేయించాలి. తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తరవాత ఉప్పు, పసుపు పొడి వేసి బాగా వేయించి తీసి చల్లారనివ్వాలి.
ఇప్పుడు కుక్కర్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి వేయించాలి. దీని తర్వాత కూరగాయలు వేసి ఉడికించాలి.తర్వాత ముందుగా వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు,
ఈ రుబ్బిన మసాలాను కుక్కర్‌లో వేసి ఉప్పు వేసి మరిగించాలి. ఓ రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది.
తర్వాత కడిగి పెట్టిన బియ్యనికి సరిపడా నీళ్లు పోయాలి. తర్వాత రెండుసార్లు విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తెరిచి బాగా కలపాలి,గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది , మీకు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. అంతే వేడివేడి గా రైస్ బాత్ రెడీ అయిపోయినట్లే దీనిని పిల్లలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళి మళ్ళి కావాలి అంటారు . దీనిలో అన్ని రకాలైన పోషకాలు కలిగి ఉన్నాయి .





Untitled Document
Advertisements