సమ్మర్లో ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లలు ఎండల్లో సైతం కూల్ గా ఫీల్ అవుతారు..

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 10:59 AM

సమ్మర్లో ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లలు ఎండల్లో సైతం కూల్ గా ఫీల్ అవుతారు..

ఎండాకాలంలో ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.ఎందుకంటే వీరికి హాఫ్ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి మధాహ్నం ఇంటికి వచ్చేస్తారు . కానీ ఆ సమయంలో కూడా ఎండా తీవ్రత ఎక్కువగా ఉంటుంది . ఈ క్రమంలో వారి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి . ఎలాగంటే గొడుగు తీసుకొని వెళ్ళాలి . అలాగైతేనే ఎండా వేడి నుండి ఉపశమనం దొరుకుతుంది . ఎక్కువగా ఎండ వచ్చే సందర్భాలు అంటే ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ అలాగే మూడున్నర గంటల మధ్యాహ్న సమయంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయం లో పిల్లల్ని బయటకి పంపించకుండా ఉండాలి. అంతే కాకుండా పిల్లలకు కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి. వారు తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా పానీయాలు ఉండేటట్లు చూసుకోవాలి దీని వలన సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటుంది.
మధ్యాహ్న సమయంలో ఎక్కువగా బయటకు వెళ్లొదు . అయితే స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా నీరు తాగాలని, నీరు తాగడంతో పాటు కొన్ని రకాల జ్యూస్ లని కూడా పిల్లలకి ఇవ్వాలి ముఖ్యంగా కొబ్బరిబోండం అలాగే కర్బూజా (వాటర్ మిలన్) వంటి ఎక్కువగా నీరు ఉన్న జ్యూస్లని తాగాలి .వీటితోపాటు బార్లీ, సగ్గుబియ్యం జావ, రాగి జావ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు.

ఇక ఆరుబయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే.. అంటే పిల్లలు బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే ఏ టైంలో ఎండ తక్కువ ఉంటుందో ఆ టైంలో బయటకు వెళ్లడం మంచిదని డాక్టర్లు సూచనలు చేస్తున్నారు. మరోపక్క డి హైడ్రేషన్ కాకుండా అంటే ఎండ ఎక్కువై డిహైడ్రేషన్ కాకుండా చాలా వరకు కూడా నీరు ఎక్కువ తాగించాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు డయేరియా కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే యాంటీబయటిక్ కి తొందరగా వెళ్లకుండా కేవలం ఇంట్లో ఉండే మెడిసిన్స్ అంటే ఓఆర్ఎస్ లాంటి వాటితోనే మెయింటైన్ చేయమని చెప్తున్నారు అంతేకాకుండా ఎండా వేడి సమయంలో పిల్లలన్నీ ఇంట్లో నే ఆడుకోవడానికి ఇన్డోర్ గేమ్స్ కు ప్రిపేర్ చేయాలి . లేదా ఏమైనా సబ్జక్ట్స్ కష్టంగా ఉన్నవి ఉంటే వాటికీ ప్రిపేర్ చేయాలి . దీని వలన వారికీ బోర్ కొట్టకుండా ఉంటుంది .







Untitled Document
Advertisements