ఎసిడిటీ సమస్యకు జీలకర్రతో చెక్

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 08:11 AM

ఎసిడిటీ సమస్యకు జీలకర్రతో చెక్

మనం చేసే వంటలో పోపు కోసం జీలకర్ర వాడుతూ ఉంటాం. అంతేకాకుండా జీరా రైస్ లాంటివి చేసి పిల్లలకు బాక్స్ లోకి పెడితే చాల బాగుంటుంది. జీలకర్రను మామూలుగా ఆహారంలా కాకుండా పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతాయని, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జీర్ష సమస్యలకు చెక్..
చాలా మందికి ఉదయం లేవగానే పొట్ట ఉబ్బినట్లుగా, రాత్రి తిన్న ఆహారం అరగనట్లుగా భావిస్తూ ఉంటారు. అలాంటివారు.. పరగడుపున జీలకర్ర తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో తినేటప్పుడు రోజంతా ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా విచ్ఛిన్నం చేస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేస్తాయి. అంతేకాకుండా మాములుగా నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు కడుపు నొప్పిగా ఉంటుంది . ఆ సమయంలో జీరా వాటర్ తాగడం వలన చాల రిలీఫ్ గా ఉంటుంది

డీటాక్సింగ్..
చాలా మంది శరీరాన్ని డీటాక్సిన్ చేయడానికి మార్కెట్లోని ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ జీలకర్ర ఈ విషయంలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.వీటిని నీటిలో మరిగించి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు టాక్సిన్స్‌ను తొలగించే అద్భుతంగా పని చేస్తుంది.

రోగనిరోధక శక్తి..
జీలకర్రతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు, ఈ చిన్న మూలకాలు మీ శరీరం , సహజ రక్షణను బలోపేతం చేయడంలో సహాయపడే రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. ఖాళీ కడుపుతో జీరా గింజలతో మీ రోజును ప్రారంభించడం ద్వారా, మీరు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు.

బరువు తగ్గిస్తుంది.
మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ సమయంలో మీకు జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర మీ జీవక్రియను పెంచుతుంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు రోజంతా కేలరీలను మరింత ప్రభావవంతంగా బర్న్ చేయడం మీ శరీరానికి సాధ్యపడుతుంది. బరువు తగ్గడతంలో సహాయపడుతుంది.
ఈ విధంగా మన కిచెన్ లో లభించే జీరా ను ఉపయోగించుకొని వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిగించుకోవచ్చును . కొందరికి కడుపులో యాసిడ్ ఫామ్ అయినట్లుగా అనిపించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఈ జీలకర్రను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది. ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం ద్వారా, మీరు ఎసిడిటీ ఆ అసౌకర్య భావాలకు వీడ్కోలు చెప్పవచ్చు .





Untitled Document
Advertisements