పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. !

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 08:34 AM

పరగడుపున  నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే.. !

ఎండాకాలం వచ్చేసింది ఎండా వేడిని తట్టుకోవడానికి చల్ల చల్లగా తాగాలి అనిపిస్తుంది . ఆ టైములో చాల మందికి నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు చాల మంచిది . అంతేకాకుండా చాలా మందికి ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.ఏ విధంగా తాగడం వలన నిమ్మరసం నీళ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ నీళ్లలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల చాల రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .

నిమ్మకాయ నీటిని చాలా రకాలుగా తీసుకుంటారు. ఈ నీటిలో కాస్త తేనెను కలిపి ఉదయాన్నే తీసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అలాగే కాస్త వేడి ఎక్కువైన మధ్యాహ్నాలు శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా నిమ్మకాయ నీటిని పంచదార కలిపి తీసుకుంటూ ఉంటారు. మరింత చల్ల బడేందుకు పలుచని మచ్చిగతో కలిపి పుదీనా ఆకులు వేసుకుని తీసుకుంటారు. దీనిలో ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది పంటి ఎనామిల్ ను పాడుచేస్తుంది. కనుక నిమ్మకాయ నీటిని తాగిన వెంటనే నోటిని నీటితో క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో నిమ్మకాయ నీరు సహకరిస్తుంది.జీర్ణక్రియకు కూడా నిమ్మకాయ మంచిదే.. అజీర్ణాన్ని తగ్గించి, జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది.
Ph స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మకాయలో ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది శరీరంపా ఆల్కలైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని PH స్థాయిలను సమతుల్యం చేస్తుంది.లెమన్ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన మన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది . బరువు తగ్గాలి అనుకునే వారు ఈ నిమ్మకాయ వాటర్ లో తేనె కలుపుకొని తాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే తగ్గవచ్చు .








Untitled Document
Advertisements