బట్టలపై ఇంక్ మరకలు పడ్డాయా? టూత్ పేస్ట్ తో ఇలా చేయండి

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 01:18 PM

బట్టలపై ఇంక్ మరకలు పడ్డాయా? టూత్ పేస్ట్ తో ఇలా చేయండి

సాధారణంగా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ,తినేటప్పుడు కానీ డ్రెస్సెస్ మరియు స్కూల్‌ యూనిఫామ్స్‌పై చాలా మరకలు పడతాయి. వాటిని ఉతకడానికి పేరెంట్స్ చాల కాస్త పడతారు . ఇవి అంత త్వరగా వదలవు. చిన్నపిల్లల బట్టలు త్వరగా మురికైపోతాయి. స్కూల్‌కి వెళ్ళినప్పుడు చాలా మరకలు అవుతుంటాయి. త్వరగా మరకలు పడిపోతాయి. ఇంక్ అలాంటివి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కువగా పడుతుంటాయి. మరి ఇలాంటి మరకల్ని ఎలా వదలించుకోవాలో చూడండి
కాస్తా గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉతకడం వల్ల కూడా మరకలు చాలా వరకూ వదులుతాయి. గోరువెచ్చని నీటిలో చాలా సేపు నానబెట్టాలి. తర్వాత ఉతకాలి ఇలా చేయడం వలన మరకలు తొందరగా పోతాయి . కొన్ని మరకలు పోవడానికి మరకలు ఉన్న ప్లేస్ లో టూత్‌పేస్టు అప్లై చేసి కాసేపు ఉంచి తర్వాత ఉతకాలి ఇలా చేయడం వలన ఆ మరకలు పోతాయి. అయితే, అన్నీ మరకలుకంప్లీట్ గా పోతాయని కాదు. కాస్తా ట్రై చేస్తే మాత్రం పోతాయి.అదే విధంగా బ్లీచింగ్ పౌడర్ రాయడం వల్ల కూడా ఇంక్ మరకలు పోతాయి. అయితే, కొద్దిగా పరిమాణంలోనే తీసుకోవాలి. మరకలు ఉన్న ప్లేస్‌లో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ రాసి తర్వాత స్క్రబ్ చేయాలి. దీని వల్ల మరక చాలా వరకూ వదులుతుంది.సాధారణంగా ఇంక్ మరకలు సబ్బుతో క్లీన్ చేస్తే పోదు. అలాంటప్పుడు డెటాల్ ఉంటే గనుక దాంతో ఈజీగా మరకని వదులుతుంది. ఇంక్ ఉన్న క్లాత్‌పై కొద్దిగా డెటాల్ వేయండి. కాసేపు ఉంచి తర్వాత టూత్ బ్రష్‌తో క్లీన్ చేయండి. ఇలా చేస్తుంటే త్వరగా మరకలు వదిలిపోతాయి. కావాలనుకుంటే ఇంకాస్తా డెటాల్ వాడొచ్చు. వీటిని ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టండి. దీని వల్ల మరక చాలా వరకూ తగ్గుతుంది. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా వరకూ మరకలు తగ్గుతాయి. అంతేకాకుండా పిల్లలకు డ్రెస్సెస్ ఎలా ఉంచుకోవాలో నేర్పించాలి. మన ఇంట్లో లభించే వాటిని ఉపయోగించుకొని బట్టల మరకలు తొలగించుకోవచ్చును. వీటికి ఎక్కువగా ఖర్చు కూడా అవదు.










Untitled Document
Advertisements