ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏ రాశి వారి పై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 02:27 PM

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏ రాశి వారి పై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?

మన భారత దేశం జ్యోతిష్యశాస్త్రంపైన ఆధారపడిన దేశం , జ్యోతిష్యశాస్త్రం అనేక గ్రహాలు , నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది . అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది మొత్తం ఐదు గ్రహాణాలు సంభవించనున్నాయి. వీటిలో మూడు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలి చంద్ర గ్రహణం మార్చి 25వ తేదీన సోమవారం నాడు ఏర్పడనుంది. ఈ సమయంలో రాహువు కన్య రాశిలో ఉంటాడు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అంతేకాకుండా ఇదే రోజున హోలీ పండుగ కూడా వచ్చింది. దీంతో తొలి చంద్ర గ్రహణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం వేళ ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి :
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వేళ ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో మీ సామాజిక ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారు నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. వాహన ప్రమాదాలను నివారించుకోవాలి. దీని కోసం మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

వృషభ రాశి(Taurus)..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం వేళ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో లావాదేవీలను వాయిదా వేసుకోవాలి. మరోవైపు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయం కోసం మరింత ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

మిధున రాశి(Gemini)..
ఈ రాశి నుంచి పదకొండో స్థానం నుంచి చంద్ర గ్రహణం ఏర్పడటం వల్ల మిధున రాశి వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీ ఆదాయ వనరులు పెరగడమే కాకుండా, మీకు రావాల్సిన బకాయిలు తిరిగొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు బలంగా ఉంటాయి. కొత్త దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

కర్కాటక రాశి(Cancer)..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కాలంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యవహారాలు సద్దుమణుగుతాయి.

సింహ రాశి(Leo)..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయి. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనాధాశ్రమాలకు విరాళాలు ఇస్తారు. మరోవైపు మీ పిల్లల సంరక్షణ సమస్యాత్మకంగా ఉంటుంది. కోర్టు సంబంధిత గొడవలు బయటే పరిష్కరించుకోవడం మంచిది.

కన్య రాశి(Virgo)..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం కాలంలో అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. మీ ప్రమాదాలను నివారించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి(Libra)..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణ కాలంలో వివాహ సంబంధిత చర్చల్లో సమ్యలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేయడం మానుకోవాలి. మీ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివాదస్పద కేసులను కోర్టు బయటే పరిష్కరించుకోవాలి.


వృశ్చిక రాశి(Scorpio)..
తొలి చంద్ర గ్రహణ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు పని చేసే రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. మీరు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తుంటే, వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

ధనస్సు రాశి(Sagittarius)..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వేళ పిల్లల విషయంలో ఆందోళనలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోతారు. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవడానికి మీకు మంచి అవకాశాలు అందుబాటులోకి ఉంటాయి.

మకర రాశి(Capricorn)..
ఈ రాశి వారికి తొలి చంద్ర గ్రహణం సమయంలో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు మానసిక క్షోభను కలిగిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి కొన్ని అశుభవార్తలు వినొచ్చు.

కుంభ రాశి(Aquarius)..
ఈ రాశి వారికి తొలి చంద్ర గ్రహణం వేళ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలతో క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. మిమ్మల్ని కించపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తులే మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. మతపరమైన విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. విరాళాలను కూడా ఇస్తారు.

మీన రాశి(Pisces)..
ఈ రాశి వారు తొలి చంద్ర గ్రహణం వేళ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేరొకరికి ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వకండి. దీని వలన సమస్యలు ఎదురుకోవలసింది వస్తుంది .

పైన తెలిసిన విషయాలను బట్టి ఈ చంద్ర గ్రహణం కొన్ని రాసుల వారికీ మంచిగా ఉంటుంది . కొన్ని రాసుల వారికీ ఇబ్బంది కలిగిస్తుంది అని తెలుస్తుంది .





Untitled Document
Advertisements