జిమ్ చేసేవారి కొరకు ఇంట్లోనే ప్రోటీన్ డ్రింక్ తయారుచేయండిలా

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 02:42 PM

జిమ్ చేసేవారి కొరకు ఇంట్లోనే ప్రోటీన్ డ్రింక్   తయారుచేయండిలా

ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా,లేడీస్ కు ఓల్డ్ ఏజ్ వారికీ , జిమ్ చేసేవారికి, బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్ ఎంత తీసుకుంటే అంత మంచిది . అందుకే, చాలా మంది జిమ్ చేశాక ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు. కానీ అవి చాల రేట్ తో కూడుకున్నాయి . వీటిని కొనడానికి కంటే అలాంటి ప్రోటీన్ షేక్‌లో కలిపే ప్రోటీన్ పౌడర్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి చూదాం .

ప్రోటీన్ పౌడర్‌ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
60 గ్రాముల వేయించిన శనగలు(పుట్నాలు)
2 ఖర్జూరాలు
1 అరటిపండు
1 గ్లాసు పాలు
కొద్దిగా బెల్లం

తయారీ విధానం..
ముందుగా పుట్నాలని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.ఇప్పుడు ఓ గ్లాసు పాలు తీసుకుని అందులో ఖర్జూరం, పాలు, బెల్లం వేసి బాగా కలపాలి.అంతే ప్రోటీన్ షేక్ రెడీ అయినట్లే. దీనిని తాగడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయంటే..
ఇలా తయారు చేసిన ప్రోటీన్ షేక్‌ని 15 రోజుల పాటు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల శరీర బలహీనత తగ్గి రోగనిరోధక శక్తి పెరగడానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయని తెలుస్తుంది . ఈ డ్రింక్ తాగితే ప్రోటీన్, కాల్షియం మీ బాడీకి అందుతుంది. జిమ్‌ తర్వాత ఈ ప్రోటీన్ షేక్ తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఇంట్లోనే తయారు చేసిన ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు, కీళ్ళ నొప్పులు కూడా చాలా వరకూ తగ్గుతాయి. కాబట్టి, కచ్చితంగా దీనిని కనీసం 15 రోజులు తాగడం మంచిదని చెబుతున్నారు.ఈ విధంగా మన ఇంట్లో చేసుకునే ప్రోటీన్ పౌడర్ వలన మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు .





Untitled Document
Advertisements