ఈ లడ్డూలతో మోకాళ్ల నొప్పులకు చెక్..

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 11:01 AM

ఈ లడ్డూలతో మోకాళ్ల నొప్పులకు చెక్..

పూర్వ కాలంలో ఇప్పపువ్వును సారా చేయడానికి ఉపయోగించేవారు . అంతేకాకుండా దీనితో లడ్డులు కూడా చేసుకోవచ్చును . ఈ లడ్డులు తినడం వల్ల రక్తహీనత ఉన్న వారికి దాదాపు 45 రోజులలో శరీరంలో రక్త శాతం పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది .ఈ లడ్డులు తినడం వలన మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఎముకలకు కావలసిన పోషక పదార్థాలు అందుతున్నాయి . దీని వల్ల నొప్పుల నుండి కొంత వరకు ఉపశమనం కలుగుతున్నది .


ఇప్ప పువ్వు లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు :
1 కప్పు కాజు
1 కప్పు , బాదం,
1 కప్పు కిస్మిస్
1 కప్పు నువ్వులు,
1 కప్పు బెల్లం
1 కప్పు ఇప్పపువ్వు

తయారీ విధానం :

1.మొదటగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నేయీ వేసుకొని దానిలో కాజ్జు ,బాదం, కిస్మిస్ , నువ్వులు వేసి వేయించుకోవాలి.
2. తర్వాత బెల్లం ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత కాజ్జు ,బాదం, కిస్మిస్ , నువ్వులు అన్ని కూడామిక్క్సీకి వేసి పక్కన పెట్టాలి.
4 ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఇప్పపూవును వేసి వేయించుకోవాలి .
5 తర్వాత అన్ని కలిపి మిక్స్ చేసుకొని లడ్డ్డు లాగా కట్టుకోవాలి అంతే ఇప్పపువ్వు లడ్డ్డు తాయారు అయినట్లే .

ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు కలిగిన ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. కావున ఇప్ప పువ్వుని తినండి మరింత ఆరోగ్యంగా ఉండండి.





Untitled Document
Advertisements