సమ్మర్ లో ఎక్కువగా లభించే ఈ కాయలో పోషకాలు మెండు!

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 01:10 PM

సమ్మర్ లో ఎక్కువగా లభించే ఈ కాయలో పోషకాలు మెండు!

ప్రకృతి మనకు దేవుడు ఇచ్చిన వరం ఎందుకంటే ప్రకృతి మనకు ఏ సీజన్‌కి తగ్గ పండ్లు, కూరగాయలు, ఆ సీజన్‌లో అందిస్తుంది. కొన్ని రకాలైన కూరగాయలు కొన్ని సీజన్ లోనే దొరుకుతాయి . అందులో ఒకటైన మునక్కాయ సమ్మర్‌లో ఎక్కువగా దొరుకుతుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీ చల్లబడుతుంది.

మునక్కాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులోని విటమిన్ సి, ఇ, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.మునగలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆపానవాయువు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని ఫైబర్ ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడానికి హెల్ప్అవుతుంది.ఇందులోఫైబర్
ఉండడం వలన మనం తిన్న చాలాసేపటి వరకూ కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇచ్చి అతిగా తినకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గడంలో ఈ మునక్కాయలు హెల్ప్ అవుతాయి.మునగలోని ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో మంట తగ్గుతుంది. అంతేకాకుండా, ఆర్థరైటిస్, అలర్జీ లక్షణాలని తగ్గిస్తుంది.
మునగని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సాంబార్, వంటలు, కూరలు, సూప్.. ఇలా ఏ పదార్థంలోనైనా కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల రుచి అందడమే కాకుండా శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.అంతేకాకుండా మునగాకును ఎక్కువగా షుగర్ పేషెంట్స్ వాడడం వలన వారి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి . ఈ విధంగా మునగ ఆకును కానీ , మునగ కాయలను కానీ దొరికే సమయం లోనే వాడుకోవాలి. .







Untitled Document
Advertisements