హోలీ వేళ రంగులతో కురులు, చర్మ సంరక్షణ కొరకు ఈ జాగ్రత్త తప్పనిసరి

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 01:56 PM

హోలీ వేళ రంగులతో కురులు, చర్మ సంరక్షణ కొరకు ఈ జాగ్రత్త తప్పనిసరి

పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండుగ హోలీ. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు . వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి . అక్కడనే కాకుండా భారత దేశం లో అనేక ప్రాంతాలలో
బంధువులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అంతా కలిసి ఈ కలర్ ఫుల్ హోలీని చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈ హోలీలో వాడే కలర్స్ వలన మన చర్మం, జుట్టుని కాపాడుకోవాలంటే కొన్ని టిప్స్ పాలో అవ్వాలి.

హోలీ కలర్స్.. ఇదివరకటి రోజులు హోలీకి సహజ కలర్స్ వాడేవారు. కానీ, ఈ రోజులు కెమికల్స్ కలిసిన కలర్స్ వాడడం వల్ల జుట్టు, చర్మానికి కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. హోలీ సమయంలో నీరు కలిపిన హోలీ కలర్స్ చర్మం, జుట్టుపై పడడం వల్ల అవి ఆరిపోయి నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే . అవి

స్కిన్ కోసం..హోలీ రోజున స్కిన్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఉదయాన్ని ముఖాన్ని క్లీన్ చేసి రోజ్ వాటర్, పచ్చి పాలతో క్లీన్ చేయండి. తర్వాత టోనర్ అప్లై చేయండి. దీంతో మురికి, జిడ్డు తొలగిపోతుంది. తర్వాత ముఖం, మెడ, చేతులు, పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయండి.దీని వలన మన ముఖానికి అంటిన రంగులు త్వరగా పోతాయి .

ఆయిల్.. అదే విధంగా, హోలీ ఆడే ముందు జుట్టు, చర్మానికి కచ్చితంతగా ఆయిల్ అప్లై చేయండి. దీనికోసం బాదం, కొబ్బరినూనె ఏదైనా అప్లై చేయొచ్చు. ఇవి మీకు రక్షణ పొరలా హోలీ కలర్స్‌తో మీపై ఎఫెక్ట్ పడకుండా చూస్తాయి. ఈ కారణంగా కెమికల్స్ చర్మం, వెంట్రుకల్లోకి చొచ్చుకుపోకుండా కాపాడుకోవచ్చు. పైగా హోలీ కలర్స్‌ని కూడా త్వరగా పోగొట్టుకోవచ్చు.

సన్‌స్క్రీన్.. అదే విధంగా సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు. SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడితే ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. యూవీ కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం SPF 40 కంటే ఎక్కువగా ఉన్నదే సన్‌స్క్రీన్ తీసుకుని ప్రతి రెండు గంటలకి ఓసారి స్కిన్‌కి రాయండి.అప్పుడే మనకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు .

గోర్లు మరువొద్దు.. అదే విధంగా,చాల మందికి గోర్లను పెంచుకునే అలవాటు ఉంటుంది . కావున చర్మం, జుట్టుని కాపాడుకున్నట్టే గోర్లని కూడా కాపాడాలి. లేకపోతే నీరు, సింథటిక్ కలర్స్ గోర్లని బలహీనంగా చేస్తుంది. రంగు నీరు అనేది బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. దీని వల్ల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రంగు మారడం, గోళ్ళ నొప్పులు వస్తాయి. అందుకే, గోర్లు, చుట్టూ ఉన్న స్కిన్‌కి కూడా నూనె రాయండి. గోర్లని పాలిష్ చేస్తే కెమికల్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

స్కార్ఫ్ .. అదే విధంగా, కలర్స్ నుంచి మీ జుట్టుని కాపాడుకోవాలంటే టోపీ, స్కార్ప్ వాడొచ్చు. బాడీ మొత్తాన్ని కప్పి ఉంచే తేలికైన కాటన్ దుస్తులు ధరించండి. లూజ్ బట్టలు వేసుకుంటే కలర్స్ చర్మంలోపలికి వెళ్ళకుండా ఉంటాయి. వీలైతే షూ వేసుకోండి.అంతేకాకుండా వీలైనంత వరకు సహజ కలర్స్ ను వాడడానికి చుడండి . ఇవి వాడడం వలన మనకు తెలియకుండా కలర్ కళ్లలో పడిన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు . ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి హోలీని సంతోషముగా జరుపుకుందాము







Untitled Document
Advertisements