దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. ఓటర్లను ప్రలోభపెట్టారంటూ కేసు నమోదు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 03:47 PM

దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు..  ఓటర్లను ప్రలోభపెట్టారంటూ కేసు నమోదు

రాజకీయ వర్గాలలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తరుపున ఎన్నికలలో పోటీ చేసిన ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళడంతో ఆయన గురించి గుసగుసలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు.
ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. అలాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు. వీటిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. మరి ఈ కేసు విషయంలో దానం ఏవిధంగా ముందుకు వెళతారు అనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements