సోంపు వాటర్ తో అజీర్తి సమస్యలకు చెక్

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 01:14 PM

సోంపు వాటర్ తో అజీర్తి సమస్యలకు చెక్

సాధారణంగా మనం అన్నం తిన తర్వాత సోంపుని కొద్దిగా నోట్లో వెసుకుంటాము.అలా కొద్దిగా సోంపు వేసుకుంటే ఫుల్ గా తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్న ఈజీగా జీర్ణం అవుతుంది. నోటి దుర్వాసనను కూడా చిటికెలో దూరం చేసేస్తుంది.అంతేకాకుండా కొన్ని రకాల వంటల్లో మాత్రమే చాలా అరుదుగా వాడుతూ ఉంటాం. అంతేకాకుండా మనం సోంపు గింజలను నీటిలో మరిగించి తీసుకుంటే మరింత ప్రయోజనం చేకూరుతుంది .

ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్ళితే ఫుడ్ బాగుంటే కాస్త ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట అంతా బరువుగా, హెవీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు చిన్న గ్లాసు సోంపు నీరు తాగితే వెంటనే పొట్ట నార్మల్ గా అయినట్లుగా, లైట్ గా మారిన అనుభూతి కలుగుతుంది.అదేవిధంగా చాలా మంది బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ సోంపు వాటర్ తాగితే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఈ సోంపు వాటర్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు రోజూ ఉదయాన్నే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల... ఇది మంచి డీటాక్సిక్ డ్రింక్ గా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్నింటినీ తొలగిండచంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.ఈ రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఏవైనా వచ్చినా వాటిని తట్టుకోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. ఈ రోగనిరోధక శక్తిని మనకు ఈ సోంపు వాటర్ అందిస్తాయి. సీజనల్ గా పిల్లలు, పెద్దలకు వచ్చే జలుబు, ఫ్ల్లూ వంటివి రాకుండా ఆపడంలో ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. అంతేకాదు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది.ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్ తో బాధపడుతున్నారు. అయితే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలి అంటే ఈ సోంపు వాటర్ తాగాల్సిందే. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది.మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎంత నొప్పి ఉంటుందో భరించే మహిళలకే తెలుస్తుంది. అలాంటి నొప్పిని తగ్గించడంలోనూ ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ వాటర్ తాగితే సరిపోతుంది . దీని వలన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది





Untitled Document
Advertisements