గృహ ప్రవేశానికి అనువైన ముహుర్తాలు ఏవంటే ?

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 09:19 AM

గృహ ప్రవేశానికి అనువైన ముహుర్తాలు ఏవంటే ?

సాధారణంగా ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనే తపన ఉంటుంది . ఎంత కష్టమైన సరే కూడు ,గుడ్డ, ఇల్లు కోసమే అని అనుకుంటారు . గృహ నిర్మాణము అంటే అంత ఈజీ అయినా పని కాదు. అందుకే పెళ్ళిచేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు. అనగా పెళ్ళి చేయడం ఇల్లు కట్టడం అంత సులభ సాధ్యము కాదని అర్ధము. గృహ నిర్మాణాలు శాస్త్ర ప్రమాణముతో వాస్తురీత్యా నిర్మించుకోవాలని అంటుంటారు . గృహ నిర్మాణము అయిపోయిన తర్వాత గృహప్రవేశ ముహూర్తం కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జరగాలి . అలాకాకుండా ముహూర్తం ప్రకారం గృహప్రవేశం, నిర్మాణం వంటివి ప్రారంభించకుండా ఇష్టప్రకారము చేసి అనేక సమస్యలు ఇబ్బందులు తెచ్చుకుంటారు . జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణానికి మాస ఫలితములు కూడా చూసుకోవాలి. వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ, ఫాల్గుణ మాసాలు గృహ నిర్మాణానికి ఉత్తమమైన మాసములని తెలుస్తుంది .

చాంద్రమానము, తెలుగు మాసాలు, ఫాల్గుణ పర్యంతము గృహనిర్మాణము చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..

శ్లో: గృహసంస్థాపనం వైత్రే। ధనహాని రృహద్భయమ్‌ ।
వైశాఖే శుభదం వింద్యా । జ్యేష్టేతు మరణం (ధ్రువమ్‌ ।
ఆషాధే గోకులం హంతి । శ్రావణే భృత్య వర్ధనమ్‌ ॥
కార్తీకే ధనలాభం స్యా ॥ న్మార్గశీర్నే మహద్భయమ్‌ 1
పుష్యే చాగ్ని భయం | వింద్యాన్మాఘేచ బహుపుత్రవాన్‌ |
ఫాల్గునే రత్నలాభం స్యా ॥ న్మాసాంచ శుభాశుభమ్‌ |
మాఘే వైశాఖమాసేతు కార్తిక్యాం శావణా తథా ।
అన్యమాసం పరిత్యజ్య చాతుర్మాసం గృహోత్తమమ్‌ ।
1. చైత్ర మాసం: గృహ ప్రవేశం లేదా ఇల్లు కడితే అందులో ఉన్న వారికి అధిక భయం, ధనవ్యయం కలుగును.

2. వైశాఖ మాసం: మంచి గ్రహబలం గల ముహూర్తమును ఏర్పాటు చేసుకొని శంఖుస్థాపన లేక గృహ ప్రవేశం చేస్తే ఆయురారోగ్య భాగ్యములు చేకూరును.


3. జ్యేష్ట మాసం: ఈ మాసమందు ఏ వాస్తు కారకుడు గృహ నిర్మాణము చేయుటకు అంగీకరించలేదు. ఇది మరణప్రదము. గృహములో యజమాని నివసించలేడు. వంశవృద్ధి ఉండదు.

4. ఆషాఢ మాసం: ఇది కూడా అంత శ్రేయస్కరమైనది కాదు. పశునాశనము, కష్టనష్టములు, చిక్కులు కల్గును.

5. శ్రావణ మాసం: ఇది చాలా జయకరమైనది. బంధుమిత్రులతో చాలా ఆనందకరముగా కాలం నడుచును. ఎట్టి లోటుపాట్లు కలుగవు.

6. భాద్రపద మాసం: ఈ మాసము గృహనిర్మాణమునకు యోగ్యముగా పరిగణించరు. ప్రజల వలన పీడ, నరఘోష ఎక్కువగా ఉంటుంది.

7. ఆశ్వీయుజ మాసం: ఇది కూడా ఇల్లు కట్టేందుకు అనువైన సమయం కాదు. ఈ సమయంలో ఇల్లు కడితే కలహాలు, అశాంతి, ధనవ్యయం, భీతి, అభిప్రాయ భేదాలు కలుగుతాయి.

8. కార్తీక మాసం: ఇది చాలా శ్రేష్టమైనది. ఆయురారోగ్యం, సుఖ క్షేమ లాభములు కలుగును. బంధుమిత్రుల వలన గౌరవాదులు, జీవన లాభం, సంఘములో గౌరవము, పలుకుబడి, మనోధైర్యం కలుగును.

9. మార్గశిర మాసం: ఇందు గృహనిర్మాణము చేయుట వలన మహాభయం, ఆందోళన, కలవరం కలిగించును. సుఖంగా ఉండలేరు. మనశ్శాంతి ఉండదు.

10. పుష్య మాసం: అనగా సంక్రాంతి దినములు గృహనిర్మాణమునకు అనుకూలించవు. ఒడిదుడుకులు అగ్ని భయం కలుగును.


11. మాఘ మాసం: అత్యుత్తమమైనది మాసం ఇది. శ్రేష్టం, లాభం, సుఖం, ఆనందము, పురోభివృద్ధి, పుత్ర పుత్రికాదులతో చాలా సంతోషంగా ఉంటారు. వృద్ధి, సంపద కలుగును.

12. ఫాల్గుణ మాసం : ఇది చాలా మంచిది. రత్నలాభం, సుఖ సంపదలు, విలువైన వస్తువులు సేకరించుట జరుగును. ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించును.

ముఖ్యముగా వైశాఖం, శ్రావణం, కార్తీకం, ఫాల్గుణ మాసాలలో గృహనిర్మాణము చేసుకోవడడం శ్రేయస్కరంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం చాల మంది కి ఇబ్బంది పెడుతున్న సమస్య గృహనిర్మాణమునకు గృహ ప్రవేశం కు ముహుర్తములు లేవు అని పెట్టుడు ముహుర్తాలు పెటుకున్టున్నారు కానీ దాని వలన చాల సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది . కావున పైన తెలిపిన విధంగా ఏ మాసాలలో అయితే మంచిదో చూసుకొని పెట్టుకోవడం మంచిది .








Untitled Document
Advertisements