వేసవి సెలవులతో మీ పిల్లలతో ఇలా గడిపితే వారికి నచ్చుతుంది

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 09:50 AM

వేసవి సెలవులతో మీ పిల్లలతో ఇలా గడిపితే వారికి నచ్చుతుంది

మార్చి, ఏప్రిల్‌లో పిల్లలందరికీ పరీక్షలు ముగుస్తాయి. పరీక్షలు ముగియడంతో పిల్లలకు స్వచ్ఛ దొరికినట్లు ఫీల్ అవుతుంటారు. ఇంకా మాకు చదువుతో సంబంధం లేదు అన్నట్లు ఉంటారు. కొంత మంది అయితే అమ్మమ్మల ఇంటికి వెళ్తారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దే ఉంటారు.ఇలా వారికీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంటే బద్ధకంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండ మొబైల్, టీవీకి ఎప్పుడూ బానిసాలు అవుతారు. అందుకని వారిని సాయంత్రంపూట బయట కాసేపు ఆడుకోనివ్వాలి. అంతేకాదు. వారు కొత్తగా ఏదైనా నేర్చుకునేందుకు అవకాశాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే వారు సరిగా ముందుకు వెళ్లగలరు.
ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు కొత్త విషయాలు నేర్పాలి. తద్వారా ఆ రోజులను సద్వినియోగం చేసుకోగలరు. చాలా విషయాలు నేర్చుకుంటారు. పరీక్షల తర్వాత పిల్లలను ఎలా బిజీగా ఉంచాలో తెలుసుకుందాం.
ప్రతి బిడ్డకు వారి స్వంత ఆసక్తి ఉంటుంది. కొంతమంది పిల్లలు బొమ్మలు గీయడానికి ఇష్టపడతారు. మరికొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం.. కాబట్టి, మీ పిల్లలను వారి ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించండి. వారికి దేనిపై ఎక్కువగా ఇంట్రస్ట్ ఉందో తెలుసుకుని దాని ప్రకారం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ సమయం మళ్ళి దొరకదు ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి . అప్పుడే వారు జీవితంలో ఏదైనా ఇష్టంగా నేర్చుకుంటారు.
పిల్లల్లో తల్లిదండ్రులకు తెలియని ప్రతిభ ఉంటుంది. కానీ చాలా మంది దానిని గుర్తించరు. ఈ సెలవు సీజన్‌లో మీ పిల్లలకు కొత్త నైపుణ్యాన్ని నేర్పండి. దీని కోసం మీరు వారిని ప్రత్యేక తరగతిలో కూడా జాయిన్ చేయవచ్చు. మీ పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో పరిశీలించండి. ఎందుకంటే తమకు నచ్చిన పనిపై పిల్లలు ఉంటారు. దీంతో వారి ఇంట్రస్ట్ గుర్తించవచ్చు.సాధారణంగా పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు, ట్యూషన్, ఇంట్లో ఇలాగే ఉంటారు. ఈ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడం చాలా అరుదు. సెలవుదినాల్లో మీ పిల్లలను బయటకు తీసుకెళ్లండి. ప్రకృతితో సమయం గడపండి. ఇవి మీ పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.పిల్లలు పాఠశాలకు, ట్యూషన్‌కు వెళతారు, వారు వారి తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేరు. దీంతో పిల్లల ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆశలు, లక్ష్యాలు తల్లిదండ్రులకు తెలియవు. ఈ సెలవుల్లో మీ పిల్లలతో మాట్లాడండి. వారి ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోండి. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత సంతోషంగా ఉంటారు. వారు తమ మనసులో ఏముందో ఓపెన్‌గా చెబుతారు.పిల్లలు సాధారణంగా సెలవుల తర్వాత మరొక తరగతికి వెళతారు. ఈ సెలవుల్లో తదుపరి తరగతి గురించి వారికి బోధించండి. దీని కోసం యూట్యూబ్ లేదా గూగుల్‌లో సెర్చ్ చేస్తే సబ్జెక్ట్‌లలో కొన్ని టాపిక్స్ కనిపిస్తాయి. దీనివల్ల తదుపరి పాఠాన్ని అర్థం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా చేస్తే తర్వాత తరగతిలో అందరికంటే ముందు మీ పిల్లలు ఉంటారు. దీంతో వారి మీద వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఈ మధ్య కాలంలో సమ్మర్ క్యాంపు లాంటివి పెడుతున్నారు వాటిలో జాయిన్ చేయండి దీని వలన వారికీ కావలసిన విషయాలు తెలుస్తాయి. ఈ క్యాంపులో స్విమ్మింగ్ , క్రికెట్ ,డాన్స్, వేదిక మాథ్స్ , అబాకస్, వంటి వాటిలో జాయిన్ చేయండి దీని వలన చదువుతో పాటు మిగతా విషయాలు తెలుస్తాయి.





Untitled Document
Advertisements